సెంచరీతో చెలరేగిన రాయుడు: హైదరాబాద్ పై ధోనీ సేన ప్రతీకారం

First Published 13, May 2018, 7:51 PM IST
Highlights

ఈ ఐపిఎల్ సీజన్ లో అమోఘంగా రాణిస్తున్న తెలుగు అంబటి రాయుడు ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో అద్భుతమైన సెంచరీ చేశాడు.

పూణే: ఈ ఐపిఎల్ సీజన్ లో అమోఘంగా రాణిస్తున్న తెలుగు అంబటి రాయుడు ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో అద్భుతమైన సెంచరీ చేశాడు. అతను 62 బంతుల్లో ఏడు సిక్స్ లు, ఏడు ఫోర్ల సాయంతో సెంచరీ సాధించి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

గత మ్యాచులో ఓటమికి ధోనీ సేన కేన్ విలియమ్స్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. హైదరాబాద్ తమ ముందు ఉంచిన 180 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హైదరాబాదుపై 8 వికెట్ల తేడాతో గెలిచింది.

షేన్ వాట్సన్ (57 పరుగులు) కలిసి రాయుడు చెన్నైకి శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సురైష్ రైనా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత ధోనీ రాయుడికి జత కలిశాడు. ఇరువురు కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. బౌలింగుపైనే ప్రధానంగా ఆధారపడి హైదరాబాద్ విజయాలను సొంతం చేసుకుంటూ వస్తోంది. అయితే చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచులో బౌలింగ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.

శిఖర్ ధావన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ సెంచరీ చేశాడు. సన్ రైజర్స్ ఆరంభం చాలా నెమ్మదిగా జరిగింది. శిఖర్ ధావన్ తో పాటు ఇన్నింగ్సును ఆరంభించిన అలెక్స్ హేల్స్ కేవలం 2 పరుగులు చేసి అవుట్యయాడు. పది ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు మాత్రమే చేసింది. 

విలియమ్సన్ 39 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ధావన్ 3 సిక్స్ లు, 10 ఫోర్లతో 79 పరుగులు చేసాడు. హుడా 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. దాంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

Last Updated 13, May 2018, 7:51 PM IST