నా చివరి శ్వాస వరకు నీతోనే...సానియా మీర్జా ఎమోషనల్ పోస్ట్

Published : Oct 31, 2019, 01:30 PM ISTUpdated : Nov 29, 2019, 10:59 AM IST
నా చివరి శ్వాస వరకు నీతోనే...సానియా మీర్జా ఎమోషనల్ పోస్ట్

సారాంశం

తన చివరి శ్వాస వరకు తన కొడుకుతోనే ఉంటానంటూ ఆమె పెట్టిన పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది. తన ముద్దుల కుమారుడిని ఎత్తుకొని సానియా ఫోటో కూడా షేర్ చేసింది. ఇంతకీ ఆ పోస్టులో సానియా మీర్జా ఏం రాసిందంటే...

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముద్దుల కుమారుడు ఇజాన్ తొలి పుట్టిన రోజు జరుపుకున్నాడు. కుటుంబసభ్యుల సమక్షంలో ఇజాన్ మొదటి పుట్టిన రోజుని అక్టోబర్ 30వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సానియా తన కొడుకు గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టు మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంది.

తన చివరి శ్వాస వరకు తన కొడుకుతోనే ఉంటానంటూ ఆమె పెట్టిన పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది. తన ముద్దుల కుమారుడిని ఎత్తుకొని సానియా ఫోటో కూడా షేర్ చేసింది. ఇంతకీ ఆ పోస్టులో సానియా మీర్జా ఏం రాసిందంటే...

‘‘ సరిగ్గా సంవత్సరం క్రితం నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావు.అప్పటి నుంచి నువ్వే మా ప్రపంచం అయ్యావు. నువ్వు పుట్టిన రోజే నవ్వావు. ఆ రోజు నుంచి ఆ నవ్వులను మాతో పంచుతూనే ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళితే...అక్కడ ఆ నవ్వులు విరబూస్తున్నాయి. నువ్వు స్వచ్ఛమైన వాడివి. ఐలవ్ యూ. ఈ రోజు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నేనే నీకు తోడుగా ఉంటాను. నువ్వు కోరుకున్న ప్రతిదీ భగవంతుడు నీకు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. సంతోషంగా, ఆనందంతో నీ జీవితం సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఇజాన్ ని మాకు ఇచ్చినందుకు అల్లాకి థ్యాంక్స్’’ అని ఆమె తన కుమారుడిని ఉద్దేశించి పోస్టు చేశారు.

మరో పోస్టులో ఓ వీడియోని విడుదల చేశారు. అందులో సానియా సోదరి ఆనమ్ మీర్జాతో బర్త్ డే బాయ్ ఇజాన్ ఆడుకుంటున్నాడు. ఈ రెండు పోస్టులు సానియా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు కూడా సానియా కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !