బంగ్లా కెప్టెన్ షకీబ్ పై నిషేధం... బుకీతో చేసిన వాట్సాప్ సంభాషణ ఇదే..

By telugu teamFirst Published Oct 30, 2019, 2:11 PM IST
Highlights

2018 ఐపీఎల్ సందర్భంలో 2018 ఏప్రిల్ 26న సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా బుకీలు సంప్రదించకపోవడాన్నీ కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. విచారణలో యాంటీ కరప్షన్ కోడ్ లోని మూడు చార్జ్ లను ఉల్లంఘించినట్లు షకీబ్ అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్ కి శిక్షను ఖరారు చేశారు.

బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ పై రెండు సంవత్సరాలపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. షకీబ్ పై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ఐసీసీ ప్రకటించింది. రెండు సంవత్సరాలపాటు ఎలాంటి ఆట ఆడకుండా ఈ నిషేధం విధించారు. ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని ఐసీసీ వెల్లడించింది. షకీబ్ బుకీతో జరిపిన వాట్సాప్ చాట్ ని కూడా తాజాగా బయటపెట్టారు.

2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా ఓ బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని షకీబ్ కి ఓ ఆఫర్ ఇచ్చాడు. తనను బుకీ కలిసి ఆఫఱ్ ఇచ్చిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా విభాగానికి షకీబ్ చెప్పలేదు. దీంతో ఆర్టికల్ 2.4.4 ప్రకారం షకీబ్ పై అభియోగాలు నమోదయ్యాయి.

2018 ఐపీఎల్ సందర్భంలో 2018 ఏప్రిల్ 26న సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా బుకీలు సంప్రదించకపోవడాన్నీ కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. విచారణలో యాంటీ కరప్షన్ కోడ్ లోని మూడు చార్జ్ లను ఉల్లంఘించినట్లు షకీబ్ అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్ కి శిక్షను ఖరారు చేశారు.

AlsoRead కోహ్లీ కి గంగూలీ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే..

కాగా... తాజాగా షకీబ్ కి, బుకీ దీపక్ అగర్వాల్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను ఐసీసీ విడుదల చేసింది. ఆ సంభాషణ ఇలా కొనసాగింది..

19 జనవరి 2018న షకీబ్ ను అభినందిస్తూ దీపక్ అగర్వాల్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ రోజు మ్యాచ్ లో షకీబ్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. మ్యాచ్ అనంతరం షకీబ్ కి ఓ మెసేజ్ వచ్చింది. అందుులో.. ‘‘నువ్వు ఇలాగే కలిసి వర్క్ చేస్తావా? లేక ఐపీఎల్ వరకు ఆగాలా?’’ అని ఉంది.

ఆ మెసేజ్ లో వర్క్ అనే పదానికి అర్థం... డ్రస్సింగ్ రూమ్ లో ఏమేమి జరుగుతుందో అందుకు సంబంధించిన సమాచారం దీపక్ అగర్వాల్ కు చెప్పాలని చెప్పడం. కాగా... ఈ విషయాన్ని షకీబ్ ఎవరికీ చెప్పకపోవడమే అతను చేసిన నేరం.

మళ్లీ 23 జనవరి 2018 లో షకీబ్ కి మరో మెసేజ్ వచ్చింది. అందులో ‘‘ బ్రో సిరీస్ లో ఏదైనా ఉందా..?’’  అనే మెసేజ్ వచ్చింది. దానికి షకీబ్ అవును అని సమాధానం ఇచ్చాడు. ఈ మేసేజ్ కి అర్థం... జట్టు సమాచారం గురించి అడగడం. 

AlsoRead నీ తప్పేంటో జడేజాను అడుగు.. మంజ్రేకర్ పై విమర్శలు...

ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ తరపున షకీబ్ ఆడిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా దీపక్ మెసేజ్ చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నావో లేదో చెప్పాలని అందులో కోరాడు. ఆ తర్వాత అగర్వాల్ తన వాట్సప్ మేసేజ్‌లో బిట్ కాయిన్స్, డాలర్ అకౌంట్స్‌ గురించి మాట్లాడటంతో పాటు షకీబ్ డాలర్ అకౌంట్ డిటేల్స్‌ అడిగాడు. ఆ తర్వాత షకీబ్‌ను ముందుగా కలవాలని కోరుకున్నట్లు అగర్వాల్ తన వాట్సాప్ సందేశంలో పేర్కొన్నాడు. 

26 ఏప్రిల్ 2018న బుకీతో దీపక్ చేసిన చాట్ ని డిలీట్ చేశాడు. అందులో జట్టు, జట్టులోని సభ్యుల గురించి వివరాలు అడిగినట్లు షకీబ్ అధికారుల ముందు అంగీకరించాడు. 

click me!