షకీబ్ అల్ హసన్ పై ఐసిసి నిషేధం: భావోద్వేగానికి గురైన భార్య

By telugu teamFirst Published Oct 30, 2019, 3:18 PM IST
Highlights

బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై ఐసిసి రెండేళ్లు నిషేధం విధించడంపై ఆయన భార్య ఉమ్మీ అహ్మద్ షిషిర్ భావోద్వేగానికి గురయ్యారు. షకీబ్ అల్ హసన్ మరింత బలంగా తిరిగి వస్తాడని ఆమె అన్నారు.

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై ఐసిసి విధించిన నిషేధంపై ఆయన భార్య ఉమ్మె అహ్మద్ షిషిర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆల్ రౌండర్ షకీబ్ పై ఐసిసి రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై షకీబ్ అల్ హసన్ భార్య ఉమ్మె అహ్మద్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. 

లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్నవాళ్లు రాత్రికి రాత్రే లెజెండ్స్ కాలేదని, ఎన్నో ఎత్తుపల్లాలనూ కష్టనష్టాలను ఎదుర్కున్నవారే ఆ స్థాయికి చేరుకుంటారని ఆమె అన్నారు. వారికి కూడా కష్ట కాలం వస్తుందని, కానీ దృఢ చిత్తంతోనూ మనో ధైర్యంతోనూ వారు పరిస్థితులను అధిగమిస్తారని ఆమె అన్నారు.

Also Read: బంగ్లా కెప్టెన్ షకీబ్ పై నిషేధం... బుకీతో చేసిన వాట్సాప్ సంభాషణ ఇదే....

షకీబ్ మానసిక స్థయిర్యం ఏమిటో తనకు తెలుసునని, కొత్త చేసే ప్రయాణానికి ఇది ప్రారంభమని, గతంలో కన్నా దృఢంగా మళ్లీ ముందుకు వస్తాడని ఆమె అన్నారు. గాయాలతో కొన్నాళ్లు క్రికెట్ కు దూరమైనప్పటికీ తిరిగి ప్రపంచ కప్ టోర్నీలో ఏ విధమైన ఆటను ప్రదర్శించాడో మనం చూశామని ఆమె అన్నారు. 

షకీబ్ పై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు.  32 ఏళ్ల షకీబ్ తన 19వ యేట 2006లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 56 టెస్టు మ్యాచులు ఆడిన షకీబ్ 3862 పరుగులు చేశాడు, 210 వికెట్లు తీసుకున్నాడు. 

షకీబ్ 206 వన్డేలు ఆడి 6323 పరుగులు చేశాడు, 260 వికెట్లు తీసుకున్నాడు.  టీ20లు 76 ఆడి 15667 పరుగులు చేశాడు, 92 వికెట్లు తీసుకున్నాడు. 

click me!