భారత ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో ఆడించాలి: పిసిబి ఛైర్మన్

Published : Feb 15, 2019, 09:43 PM IST
భారత ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో ఆడించాలి: పిసిబి ఛైర్మన్

సారాంశం

పాకిస్థాన్ సూపర్ లీగ్... దుబాయ్ వేదికగా గత మూడేళ్లుగా పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. అయితే ఈ లీగ్ లో అన్ని దేశాల క్రీడాకారులు ఆడుతున్నా భారత ఆటగాళ్లు మాత్రం ఆడటం లేదు. పాకిస్థాన్-ఇండియాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆ ప్రభావం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. దీంతో బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ కు పాక్ క్రికెటర్లు దూరమవగా...పాకిస్థాన్ పీఎస్ఎల్ కు భారత ఆటగాళ్లు దూరంగా వుంటున్నారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

ఈ క్రమంలో భారత ఆటగాళ్లు లేని వెలితి పీఎస్ఎల్ లో కనిపిస్తోంది. దీన్ని పూడ్చడానికి పిసిబి ఛైర్మన్ ఇసాన్ మనీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బిసిసిఐ ని పొగుడుతూనే  విదేశీ లీగుల్లో భారత ఆటగాళ్లు ఆడేలా చూడాలంటూ సలహా ఇచ్చారు. 

బిసిసిఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) క్రికెట్ అభివృద్ది కోసం తీసుకునే నిర్ణయాలు బావుంటాయని ఇసాన్ ప్రశంసించారు. అయితే కొన్ని విధానాల్లో మాత్రం బిసిసిఐ మార్పులు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా విదేశీ లీగుల్లో భారత ఆటగాళ్లను భాగస్వామ్యం చేస్తే అంశంపై ఆలోచించాలని సలహా ఇచ్చారు. 

బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ వంటి టోర్నీల్లో విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కాబట్టి భారత ఆటగాళ్లు కూడా విదేశాల్లో జరిగే లీగుల్లో పాల్గొంటే బావుండేది. కానీ వారి స్వదేశంలో జరిగే ఐపీఎల్‌ మినహాయించి విదేశాల్లో జరిగే ఏ టీ20 లీగుల్లో టీమిండియా ఆటగాళ్లు ఆడటం లేదు. ఇది మంచి పద్దతి కాదని ఇసాన్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !