తెలుగు క్రికెటర్ హనుమ విహారీ అరుదైన ఘనత...

By Arun Kumar PFirst Published Feb 15, 2019, 5:57 PM IST
Highlights

తెలుగు క్రికెటర్ హనుమ విహారి రంజీ మ్యాచుల్లో అదరగొడుతున్నాడు. ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా తరపున బరిలోకి దిగిన విహారి తన బ్యాట్ ను ఝలిపించాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ సెంచరీలతో ఇప్పటివరకు ఇరానీ కప్ టోర్నీ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ గా విహారీ  అరుదైన ఘనత సాధించాడు. 
 
ఇరానీ కప్ టోర్నీలో భాగంగా విధర్భతో జరిగుతున్న మ్యాచ్ లో విహరీ చెలరేగి అడుతున్నాడు. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో 114 పరుగులతో మెరిసిన ఇతడు...రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 189 పరుగులు సాధించాడు. ఇలా ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలతో విహారి రెస్టాఫ్ ఇండియా జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందించాడు.  

గత ఏడాది జరిగిన ఇరానీ కప్‌లో కూడా ఇదే విదర్భతో మ్యాచ్ సందర్భం విహారీ ఓ సెంచరీ సాధించాడు. ఆ  మ్యాచ్ లో చెలరేగి ఆడిన విహారి 183 పరుగులు సాధించాడు. మళ్లీ ఇప్పుడు రెండు సాధించాడు. ఇలా ఇరానీ కప్ లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా హనుమ విహారి నిలిచి రికార్డు నెలకొల్పాడు. 

అలాగే ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు సాధించిన ఆటగాడిగా విహారీ ధావన్ రికార్డును సమం చేశాడు. 2011 లో శిఖర్ ధావన్ కూడా ఇదే రెస్టాఫ్ ఇండియా తరపున బరిలోకి దిగి ఇలాగే రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు సాధించాడు.  తొమ్మిదేళ్ల తర్వాత విహారి ఈ రికార్డును సమం చేశాడు.  
 
click me!