సానియా మీర్జా సోషల్ మీడియా పోస్టులపై నెటిజన్ల ఫైర్...పాకిస్థానీ బహూ అంటూ

Published : Feb 15, 2019, 07:37 PM ISTUpdated : Feb 15, 2019, 07:46 PM IST
సానియా మీర్జా సోషల్ మీడియా పోస్టులపై నెటిజన్ల ఫైర్...పాకిస్థానీ బహూ అంటూ

సారాంశం

జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిలో 44మంది బారత జవాన్లు బలయ్యారు. దీంతో వీరమరణం పొందిన సైనికులకు భారత ప్రజలందరు నివాళులర్పిస్తున్న సమయంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యింది. 

దేశాన్ని కాపాడే సైనికులపై ఉగ్రమూకలు దాడికి పాల్పడి వారి ప్రాణాలను బలితీసుకోవడంతో యావత్ భారతావని దు:ఖంలో మునిగిపోయింది. జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిలో 44మంది బారత జవాన్లు బలయ్యారు. దీంతో వీరమరణం పొందిన సైనికులకు భారత ప్రజలందరు నివాళులర్పిస్తున్న సమయంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టెన్నిస్ ప్లేయర్ ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏమిటని నెటిజన్లు సానియాను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు.  

సానియా మీర్జా తన ఇన్స్‌స్టాగ్రామ్ లో తన సోదరి, ప్యాషన్ డిజైనర్ అనమ్ మిర్జా రూపొందించిన దుస్తులను ధరించి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఉగ్రదాడిలో సైనికుల దుర్మరణం చెందిన సమయంలో సానియా ఇలా ప్యాషన్ కు సంబంధించిన దుస్తులకు సంబంధించిన ఫోటోలు పెట్టడం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు సానియా ఫోటోలపై తీవ్ర పదజాలంతో కాంమెంట్లు చేస్తున్నారు. 

''ఇక్కడ తమ సైనికులు ప్రాణాలు కోల్పోతే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు...నువ్వు కదా అసలైన పాకిస్థానీ'' అంటూ ఒకరు ఘాటుగా కామెంట్ చేశారు. ''దేశంపై కాస్తయినా ప్రేమ చూపించు సానియా''  `ఆమె పాకిస్థాన్‌ కోడలు...వారి మాదిరిగానే ఆమె ఆలోచనలు కూడా వుంటాయి'' ''ఇలాంటి సమయంలో ఈ పోస్ట్ చేసినందకు కాస్తయినా సిగ్గుపడు'' అంటూ ఆమె ఫోటోపై నెటిజన్లు తీవ్ర పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు.

అయితే పుల్వామా దాడిని ఖండిస్తూ సానియా ట్విట్టర్ ద్వారా స్పందిచారు. ''భారత సీఆర్ఫీఎఫ్ సైనికులపై హటాత్తుగా జరిగిన దాడి  తననెంతో బాధకు గురిచేసింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రటిస్తన్నా. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి అసలు చోటు లేకుండా చేయాలి. శాంతి కోసం ప్రార్థించండి'' అంటూ సానియా ట్వీట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !