Paris Olympics 2024 : స్వాతంత్య్ర భార‌తంలో ఒకే ఒక్క అథ్లెట్.. మ‌ను భాక‌ర్ స‌రికొత్త రికార్డు

By Mahesh Rajamoni  |  First Published Jul 30, 2024, 6:47 PM IST

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ రెండో పతకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్యం సాధించింది. 


Paris Olympics 2024 : ఫ్రాన్స్ లో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ 2024లో మంగళవారం జరిగిన 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్-సరబ్జోత్ సింగ్ జోడీ భార‌త్ కు రెండో ఒలింపిక్ పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన మను,-సరబ్‌జోత్‌లు 16-10 తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించి షూటింగ్‌లో భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు. అంత‌కుముందు, మను భాక‌ర్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది, అయితే పురుషుల ఈవెంట్‌లో పోటీపడుతున్న సరబ్జోత్ విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. కానీ, మ‌ను-సరబ్‌జోత్‌ల జోడీ భార‌త్ కు రెండో మెడ‌ల్ ను అందించింది. ఈ క్ర‌మంలోనే మ‌ను భాక‌ర్ సింగ్ అనేక రికార్డులు సృష్టించారు. ఒలింపిక్ క్రీడలలో రెండు ప‌త‌కాలు గెలుచుకున్న స్వతంత్ర భారతదేశపు మొదటి క్రీడాకారిణిగా చ‌రిత్ర సృష్టించింది.

భారతీయ క్రీడలు కొన్ని సంవత్సరాలుగా భార‌త్ కు ఒలింపిక్స్ మెడ‌ల్స్ ను అందించాయి. కేడీ జాదవ్, మేజర్ ధ్యాన్ చంద్, కర్ణం మల్లీశ్వరి, అభినవ్ బింద్రా (మొదటి వ్యక్తిగత స్వర్ణ విజేత), సైనా నెహ్వాల్, సుశీల్ కుమార్, పీవీ సింధు, నీరజ్ చోప్రా, ఇంకా ఎందరో దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. అయితే, వారిలో ఎవరూ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఘనతను సాధించలేకపోయారు కానీ, మ‌ను భాక‌ర్ పారిస్ లో జ‌రుగుతున్న ఒలింపిక్స్ రెండు మెడ‌ల్స్ సాధించారు. 

Latest Videos

undefined

 

మ‌ను భాక‌ర్ సాధించిన రికార్డులు ఇవే..  

  • 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో సుమ షిరూర్ తర్వాత ఒలింపిక్ షూటింగ్ ఫైనల్ కు చేరిన తొలి భారతీయ మహిళ మ‌నుభాక‌ర్. 
  • ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ మ‌ను భాక‌ర్.
  • ఎయిర్ పిస్టల్ విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మ‌ను భాక‌ర్.
  • ఒలింపిక్స్ లో ఒకే ఎడిషన్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మ‌ను భాక‌ర్.
  • రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత షూటర్ మ‌ను భాక‌ర్.
  • ఒలింపిక్స్ లో టీమ్ మెడల్ సాధించిన తొలి భారత షూటింగ్ జంట (మను భాక‌ర్, సరబ్ జ్యోత్ సింగ్).
  • వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్.

మను భాకర్ సంచలనం.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు రెండో మెడల్

click me!