paris olympics : గ్రూప్ స్టేజ్‌లో టాప్ లో భారత హాకీ జట్టు.. క్వార్టర్స్ బెర్త్ ఖాయం

Published : Jul 30, 2024, 10:40 PM ISTUpdated : Jul 30, 2024, 11:10 PM IST
paris olympics : గ్రూప్ స్టేజ్‌లో టాప్ లో భారత హాకీ జట్టు.. క్వార్టర్స్ బెర్త్ ఖాయం

సారాంశం

india hockey paris 2024 olympics : పారిస్ 2024 ఒలింపిక్స్ లో భార‌త హాకీ జ‌ట్టు ఐర్లాండ్‌పై విజయంతో గ్రూప్ స్టేజ్‌లో రెండో గెలుపును సాధించింది. ఈ విజయంతో భారత్ ఏడు పాయింట్లతో ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది.   

india hockey paris 2024 olympics : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త హాకీ జ‌ట్టు జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని అందుకుని గ్రూప్ స్టేజ్ లో టాప్ లో కొన‌సాగుతోంది. మంగ‌ళ‌వారం ఐర్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత్ ఏడు పాయింట్లతో తాత్కాలికంగా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బెల్జియం, ఆస్ట్రేలియా కంటే భార‌త్ ఒక పాయింట్ తో ముందుంది. వైవ్స్ డు మనోయిర్ స్టేడియంలో జరిగిన ఒలింపిక్స్‌లోని పూల్-బీ హాకీ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫస్ట్ హాఫ్ బ్రేస్‌తో ఐర్లాండ్ నుండి బలమైన సవాలును అధిగమించి భారత్ 2-0 తేడాతో విజయం సాధించింది.

రెండు విజయాలు, ఒక డ్రాతో భారత్ మూడు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లు సాధించి దాదాపు క్వార్టర్స్ బెర్త్‌ను దక్కించుకుంది. న్యూజిలాండ్, అర్జెంటీనాపై అద్భుతమైన ఆట తీరు తర్వాత, ఐర్లాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు గ్యాప్‌లను అన్వేషించి, బంతిని బాగా పాస్ చేయడంతో భారత్ మెరుగైన ఆరంభాన్ని పొందింది. అభిషేక్ ఎడమవైపు అద్భుతంగా ఆడాడు. సుఖ్‌జీత్‌తో కలిసి రెండవ నిమిషంలో భారతదేశానికి మొదటి పెనాల్టీ కార్నర్‌ను సంపాదించాడు. 11వ నిమిషంలో గుర్జంత్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, మన్‌దీప్ సింగ్‌తో జతకట్టడంతో భారత్ పట్టుదల ఫలించింది. ఇక్క‌డ‌ వచ్చిన పెనాల్టీ స్ట్రోక్‌తో హర్మన్‌ప్రీత్ దానిని స్లాట్ చేయడంతో భారత్ కు మ‌రో పాయింట్ ద‌క్కింది. చివ‌ర‌కు భార‌త్ 2-0 తో మ్యాచ్ ను గెలుచుకుంది.

షూటింగ్‌లో ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన భారత అథ్లెట్లు వీరే..

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆ త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్ లో అర్జెంటీనాతో 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు ఐర్లాండ్ పై గెలుపుతో భార‌త్ కు 7 పాయింట్లు ల‌భించాయి. ఇప్ప‌టివ‌ర‌కు గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే భార‌త్ క్వార్టర్స్ బెర్త్ దాదాపు ఖాయ‌మే. శుక్రవారం బలమైన ఆస్ట్రేలియాతో పూల్ మ్యాచ్ లు ముగించే ముందు భారత్ గురువారం ఒలింపిక్ ఛాంపియన్ బెల్జియంతో తలపడనుంది.

 

 

Paris Olympics 2024 : మను భాకర్-సరబ్‌జ్యోత్‌ సింగ్ జోడీతో ప్ర‌ధాని మోడీ ఫోన్ కాల్.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !