ఏడాదిగా జీతం ఇవ్వడంలే.. రిజైన్ చేస్తున్నా : పాకిస్తాన్ హకీ కోచ్

Published : May 21, 2023, 04:47 PM ISTUpdated : May 21, 2023, 04:59 PM IST
ఏడాదిగా జీతం ఇవ్వడంలే.. రిజైన్ చేస్తున్నా : పాకిస్తాన్ హకీ కోచ్

సారాంశం

Pakistan: ఆర్థిక మందగమనం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో  ఆడే తమ దేశ హాకీ జట్టు కోచ్‌కు కూడా  సాలరీలు ఇవ్వలేని  దుస్థితిలో   పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్)  ఉంది.

గత కొంతకాలంగా  పాకిస్తాన్  దేశ ఆర్థిక వ్యవస్థ   ఆర్థిక మందగమనంతో అల్లాడుతున్న విషయం తెలిసిందే.  ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరల రేట్లు కొండెక్కాయి. ఈ ఎఫెక్ట్  ఆ దేశ క్రీడారంగాన్ని కూడా తాకింది.  అంతర్జాతీయ స్థాయిలో  ఆడే తమ దేశ హాకీ జట్టు కోచ్‌కు కూడా  సాలరీలు ఇవ్వలేని  దుస్థితిలో   పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్)  ఉంది.  ఇదే కారణంతో  పాకిస్తాన్  హాకీ జట్టు జాతీయ కోచ్..  డచ్ దేశానికి చెందిన సీగ్‌ఫ్రెడ్ ఐక్‌‌మాన్  తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు.   

ఈ మేరకు  ఐక్‌‌మాన్ పాకిస్తాన్  లోని సామా న్యూస్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.  గత ఏడాదికాలంగా తనకు  జీతం లేదని..  రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి పీఎస్‌హెచ్ కాలయాపన చేస్తున్నదని   ఆయన ఆరోపించాడు. 

ఐక్‌‌మాన్ గతేడాది  పాకిస్తాన్ హాకీ టీమ్ తో కలిశాడు. ఏడు నెలల పాటు ఆ జట్టుకు సేవలందించిన  ఆయన.. తర్వాత  జీతం ఇవ్వకపోవడంతో డచ్ కు తిరిగివెళ్లిపోయాడు.     పీహెచ్ఎఫ్ నుంచి  కూడా ఐక్‌‌మాన్ కు ఎలాంటి    స్పందన రాకపోవడంతో ఆయన తన   పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. 

 

ఇదిలాఉండగా పీహెచ్ఎఫ్ మరో డచ్ కోచ్ రొలెంట్  ఒల్టమన్స్  ను   పాకిస్తాన్ జూనియర్ హాకీ టీమ్ కు  కోచ్ గా తీసుకుంది.  ఆయన ఇప్పటికే  లాహోర్ కు చేరుకున్నాడు.   త్వరలోనే మస్కట్ వేదికగా జరుగుబోయే ఆసియా జూనియర్ హాకీ కప్ లో పాల్గొనబోయే టీమ్ కు కోచ్ గా వ్యవహరిస్తాడు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు