''పాక్ జట్టు కావాలనే ఓడిపోయింది...లేకుంటే మరోసారి''

By Arun Kumar PFirst Published Sep 27, 2018, 2:37 PM IST
Highlights

ఆసియా కప్ లో పాకిస్థాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దాయాది భారత్ చేతిలో రెండు సార్లు ఘోర ఓటమిని చవిచూసిన తమ జట్టుపై పాక్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో సూపర్ 4 లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్ లో బంగ్లా చేతిలో కూడా ఘోరంగా ఓడిపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. దీంతో పాక్ జట్టుపైనా, క్రికెటర్లపైనా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

టీంఇండియా చేతిలో మరోసారి ఓడిపోతామనే భయం వెంటాడటంతో ఈ టోర్నీ నుండి నిష్క్రమించాలని పాక్ క్రికెటర్లు భావించారని అనుకున్నారట. అందువల్లే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కావాలనే ఓడిపోయారని ఓ అభిమాని ట్విట్టర్ లో పాక్ క్రికెటర్లను ఎద్దేవా చేశాడు. మరో అభిమాని అయితే పాక్ ఓడిపోయినందుకు అల్లాకు థ్యాంకు చెప్పాడు. లేకుంటే భారత్ చేతిలో హ్యాట్రిక్ ఓటమిని చవిచూడాల్సి వచ్చేదని అన్నాడు. 

మరికొందరు అభిమానులు పాక్ కెప్టెన్ సర్పరాజ్ పై విరుచుకుపడుతున్నారు. ఆయన వల్లే పాక్ జట్టు విఫలమవుతోందని అంటున్నారు. కొందరయితే  సర్పరాజ్ ఓ బుర్రలేని, సోమరిపోతు కెప్టెన్ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. 95 మ్యాచ్ లు ఆడి కేవలం రెండు సెంచరీలు చేసిన వ్యక్తిని టీం పగ్గాలు అప్పగిస్తే ఫలితం ఇలానే ఉంటుందంటూ ఒకేసారి అటు కెప్టెన్ ఇటు సెలెక్టర్లపై తమ ట్వీట్ల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Pakistan HAVE TO win this game having chosen to bat first. If the don’t, the flood gates will open on Sarfraz & HIS decision!

— Kevin Pietersen🦏 (@KP24)

Thanku Allah for saving us from consecutive 3rd defeat by India

— Muhammad Sana Ullah (@Muhamma00823076)

మరిన్ని వార్తలు

''అంత్యంత సోమరి, బుర్రలేని, ప్రతిభ లేని కెప్టెన్ అతడు''
 
click me!