క్రికెట్‌ను అభివృద్ది చేసే విషయంలో భారత్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్. మేటి జట్టును తయారు చేసుకోవడానికి సమయం పడుతుంది.
క్రికెట్‌ను అభివృద్ది చేసే విషయంలో భారత్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్. మేటి జట్టును తయారు చేసుకోవడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎదురయ్యే పరాజయాలకు కంగారుపడిపోయి ఆటగాళ్లను మార్చకూడదు.
భారీ మార్పులు చేయాలనుకున్నప్పుడు కొత్త క్రికెటర్లకు తగిన సమయం ఇవ్వాలి. ప్రతిభ గత ఆటగాళ్లను గుర్తించడంలో.. వారికి తగినన్ని అవకాశాలు ఇవ్వడంలో భారత్ అనుసరిస్తున్న పద్ధతులను మనం నేర్చుకోవాలని మాలిక్ సూచించాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారత్ అత్యుత్తమ జట్టని షోయాబ్ ప్రశంసించాడు.