డానిష్‌కు చెందిన క్వాంట్ బయోరెస్ అనే కోవిడ్ ఔషధ తయారీ సంస్థలో జకోవిచ్, అతని భార్యకు 80 శాతం వాటా ఉన్నట్లు సంస్థ సీఈవో ఇవాన్ తెలిపాడు. త్వరలో తమ ఔషధంతో Clinical trials నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వార్తలపై జకోవిచ్ స్పందించాల్సి ఉంది.
vaccine వేసుకోని కారణంగా Australian Openలో పాల్గొనకుండా గెంటివేయబడ్డ ప్రపంచ నెంబర్-1 టెన్నిస్ స్టార్ Novak Djokovic.. ఔషధ తయారీ రంగంలోకి అడుగుపెట్టాడని సమాచారం. అతడికి
covid antidote మందు తయారు చేసే సంస్థలో భారీ వాటా ఉన్నట్లు సదరు కంపెనీ సీఈఓనే స్వయంగా వెల్లడించాడు. డానిష్‌కు చెందిన క్వాంట్ బయోరెస్ అనే కోవిడ్ ఔషధ తయారీ సంస్థలో జకోవిచ్, అతని భార్యకు 80 శాతం వాటా ఉన్నట్లు సంస్థ సీఈవో ఇవాన్ తెలిపాడు.
త్వరలో తమ ఔషధంతో Clinical trials నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు అయితే ఈ వార్తలపై జకోవిచ్ స్పందించాల్సి ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు అనుమతి లభించక పోవడంతో.. 21 గ్రాండ్‌స్లామ్ గెలిచే అవకాశం జకోవిచ్ చేజార్చుకున్నాడు. మరోవైపు అతను వ్యాక్సిన్ వేసుకోకపోతే French Openలో కూడా అడనిచ్చేది లేదని ఫ్రెంచ్ అధికారులు సైతం స్పష్టం చేశారు. దీనితో జకోవిచ్ వ్యాక్సిన్ వేసుకుంటాడా? లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
undefined
ఇదిలా ఉండగా, జనవరి 6న novak djokovic ఎంట్రీ వీసాను రద్దు చేసినట్లు Australia ప్రకటించింది. దీంతో Australian Open Grand Slam టెన్నిస్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రత్యేక వైద్య మినహాయింపుతో ఇక్కడికి వచ్చిన Defending champion, ప్రపంచ నంబర్ వన్ జొకోవిచ్ కు ఊహించని షాక్ ఎదురయ్యింది. దీనికి ముందు Corona virus vaccination రెండు డోసులు వేసుకోకున్నా.. టోర్నమెంట్‌లో ఆడేందుకు తనకు వైద్యపరమైన Exception ఉందని సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నాడు జోకోవిచ్. ఆ తర్వాత సెర్బ్ బుధవారం సాయంత్రం మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టాడు.
ఒక్క డోసూ తీసుకోకపోయినా.. ఆరంభ గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు జోకోవిచ్. టోర్నీ నిర్వాహకులు ఇందుకు అనుమతి కూడా మంజూరు చేశారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ -19 లాక్‌డౌన్‌లు, కరోనా ఆంక్షలను భరించిన ఆస్ట్రేలియన్లలో.. అతని దరఖాస్తును రెండు మెడికల్ ప్యానెల్లు క్లియర్ చేయడం, ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు మంజూరు చేసిన వ్యాక్సిన్ మినహాయింపులు.. విపరీతమైన కోపాన్ని రేకెత్తించాయి.
తొమ్మిది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ గెలుచుకున్న జొకోవిచ్ ఎప్పుడూ సరిహద్దు నియంత్రణను దాటలేదు. అయితే మినహాయింపు కోసం అతను జతచేసిన ధృవపత్రాల్లో సహేతుక కారణాలు ఉండాల్సిందే. ఆస్ట్రేలియా వీసా కోసం ఇవన్నీ స్క్రూటినీ చేశాకే వీసా మంజూరు చేశారు. అయితే "జొకోవిచ్ ఆస్ట్రేలియాలోకి ఎంట్నీకి అవసరమైన తగిన సాక్ష్యాలను అందించడంలో విఫలమయ్యాడు.అతని వీసా తరువాత రద్దు చేయబడింది" అని ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
అంతేకాదు.. ఎంట్రీ సమయంలో ఎక్స్ పైర్ అయిన వీసా ఉన్నవాళ్లు, వీసా రద్దు చేయబడిన వారు ఆస్ట్రేలియా నుంచి డిటైన్ చేయబడతారని, పంపించేయబడతారని వారు తెలిపారు. అందుకే ‘ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ మా సరిహద్దు వద్దకు వచ్చేవారు మా చట్టాలు, ప్రవేశ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది." అని తెలిపారు.
'క్షమాపణలు లేవు'..
ఈ అంశంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ కూడా స్పందించారు. టీకా తీసుకోకపోవడానికి గల సరైన కారణాలుంటేనే వీసాగానీ, ఆడనిచ్చేది గానీ జరుగుతుందని లేదంటే.. ఎంతవారైనా తిరుగు ప్రయాణం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో వైరస్ వ్యాప్తి, మరణాల రేటును కంట్రోల్ ఉంచడానికి కఠినమైన సరిహద్దు విధానాలు చాలా కీలకమైనవని అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ అన్నారు.
అంతేకాదు ‘ఈ నిబంధనలకు ఎవరూ అతీతులు కాదని.. దీనిమీద ప్రభుత్వం క్షమాపణలు చెప్పలేదు’ అని హోం వ్యవహారాల మంత్రి కరెన్ ఆండ్రూస్ అన్నారు. ‘కఠినంగా కనిపిస్తున్నా అందరూ ఈ నిబంధనలు పాటించాల్సిందే. వీటిని ఫాలో అవ్వని వ్యక్తులకు ఆస్ట్రేలియాలో ప్రవేశం నిరాకరించబడుతుంది, వారు ఎంత గొప్పవారైనా సరే" అని ఆమె ఒక ప్రకటనలో తెలిపింది.