మాంట్రియల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న 18 ఏళ్ల మెక్సికన్ బాక్సర్ జెన్నెట్... తీవ్రంగా గాయపడి, ఐదు రోజుల తర్వాత మృత్యువాత...
క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. 18 ఏళ్ల వయసులో యంగ్ బాక్సర్ జెన్నెట్ జకారియాస్ జపాటా... రింగ్‌లో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో ఐదు రోజుల పాటు పోరాడి ప్రాణాలు విడిచింది. మెక్సికోకి చెందిన జెన్నెట్, మాంట్రియల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్‌లో పాల్గొంది.
శనివారం రాత్రి ఐజీఏ స్టేడియంలో మ్యారీపెయిర్ హులేతో జరిగిన బౌట్‌లో తీవ్రంగా గాయపడిన జెన్నెట్, గాయాలను లెక్కచేయకుండా మరో రెండు రౌండ్లు పోరాడింది. నాలుగో రౌండ్‌లో మ్యారీ కొట్టిన అప్పర్ కట్ షాట్‌కి జెన్నెట్ ఒక్కసారిగా షాక్‌కి గురై కిందపడిపోయింది. ఆ తర్వాత ఫైనల్ రౌండ్‌లో మ్యారీ కొట్టిన పంచ్‌కి జెన్నెట్ మౌత్‌గార్డ్ బయటికి వచ్చేసింది...
¡Oremos 🙏🏻 por nuestra paisana Jeanette Zacarías Zapata que se encuentra en condición MUY grave! pic.twitter.com/UgIGUdcxX7
— No Puedes Jugar Boxeo (@NPJBoxeo)
రక్తం కారుతున్నా, ప్రత్యర్థి కొట్టిన పంచ్‌లకు కుదేలైన ఆమెను స్ట్రైచర్‌పై ఆసుపత్రికి తీసుకెళ్లారు. తలకు తగిలిన పంచ్‌కి ఆమె మెదడులో తీవ్ర రక్తస్రావం అయ్యి, కోమాలోకి వెళ్లింది. మృత్యువుతో పోరాడుతూ ఆమె గురువారం ప్రాణాలు కోల్పోయింది.