మెడల్ నెం.13... టోక్యో పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ఆర్చర్ హర్వీందర్ సింగ్...

By Chinthakindhi Ramu  |  First Published Sep 3, 2021, 6:23 PM IST

పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన మొట్టమొదటి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించిన హర్వీందర్ సింగ్...  పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల చరిత్ర... 


టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. కొరియో పారా ఆర్చర్ కిమ్ మిన్ సుతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ హర్వీందర్ సింగ్ షూట్ ఆఫ్‌లో 6-5 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుని, కాంస్య పతకం గెలిచాడు. పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన మొట్టమొదటి భారత ఆర్చర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు హర్వీందర్ సింగ్...

ఓవరాల్‌గా భారత్‌కి పారాలింపిక్స్‌ 2020లో ఇది 13వ పతకం. ఇంతకుముందు పారాలింపిక్స్ చరిత్రలోనే 1968 నుంచి 2016 వరకూ ఓవరాల్‌గా భారత్ మొత్తం 12 పతకాలు గెలవగా, టోక్యో పారాలింపిక్స్‌లోనే 13 పతకాలు సాధించారు భారత పారా అథ్లెట్లు... 

Latest Videos

undefined

అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచి, చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా... 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్‌లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది అవనీ లేఖరా...

హై జంప్ టీ64 విభాగంలో 2.07 మీటర్లతో ఆసియా రికార్డు క్రియేట్ చేసిన ప్రవీణ్ కుమార్... రజత పతకాన్ని సాధించాడు. ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది.

click me!