భార్యలను తీసుకువెళ్లడం వారి వ్యక్తిగతం.. గంభీర్

By ramya neerukondaFirst Published Oct 11, 2018, 1:55 PM IST
Highlights

పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించారు.


క్రికెటర్లు టూర్లకు వెళ్లినప్పుడు.. వెంట తమ భార్యలను తీసుకొని వెళ్లడం వారి వ్యక్తిగతమని టీం ఇండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించారు.

దీనిపై గంభీర్‌ మాట్లాడుతూ.. ‘ఆటగాళ్ల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. కొందరికి టూర్‌ మొత్తం కుటుంబంతోనే ఉండాలని ఉంటుంది. మరికొందరు కొద్ది సమయం మాత్రమే కుటుంబానికి కేటాయిస్తారు. మిగతా సమయంలో క్రికెట్‌పై దృష్టి పెడతారు. నిర్ణయం ఏదైనా సరే అది భారతీయ క్రికెట్‌కు మంచి జరిగేదిగా ఉండాలి’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరోవైపు విరాట్‌ అభ్యర్థనపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పాలకుల కమిటీ తేల్చి చెప్పింది. కొత్తగా ఏర్పడే బీసీసీఐ కార్యవర్గానికే ఈ నిర్ణయం వదిలేశామని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. చాలా దేశాలు ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి.

click me!