Kho Kho World Cup 2025 EXCLUSIVE: ఆసియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత మహిళా ఖో ఖో జట్టు ప్రధాన కోచ్ డాక్టర్ మున్నీ జూన్ .. కలలు కన్నప్పుడే అవి నిజజీవతంలోకి వచ్చి నెరవేరుతాయని అన్నారు.
Kho Kho World Cup 2025 EXCLUSIVE: ఖో ఖో ప్రపంచ కప్ 2025 కు భారత్ వేదికైంది. సోమవారం ప్రారంభం కానున్న సాంప్రదాయ క్రీడల్లో ఒకటైన ఖో ఖో చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. జనవరి 13 నుండి 19 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనున్న ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులు పాల్గొంటారు. ఖో ఖో స్థానిక క్రీడ నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రీడగా మారడాన్ని మరింత బలపరుస్తుంది.
ఆసియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత మహిళా ఖో ఖో జట్టు ప్రధాన కోచ్ డాక్టర్ మున్నీ జూన్ తన అనుభవాలను పంచుకున్నారు. డాక్టర్ జూన్‌కి, ప్రపంచ కప్ కేవలం పోటీ మాత్రమే కాదు, ఆటగాళ్ళు, కోచ్‌లు, నిర్వాహకుల సంవత్సరాల అంకితభావం, వారి కృషికి పరాకాష్టగా చెప్పవచ్చు.
ఖో ఖో ప్రపంచ కప్ 2025: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
"నిజం చెప్పాలంటే, నా ఆనందానికి హద్దులు లేవు. మేము మట్టిలో ఖో ఖో ఆడాము.. ఇప్పుడున్న ఇలాంటి సౌకర్యాలు ఎప్పుడూ లేవు. కలలు కన్నప్పుడే అవి నిజమవుతాయి అంటారు. ఖో ఖో ఇంత స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది అని" అని డాక్టర్ జూన్ అన్నారు.
జనవరి 13న పురుషుల విభాగంలో భారత్, నేపాల్ మధ్య ఖోఖో ప్రపంచ కప్ 2025 లో తొలి మ్యాచ్ జరగనుంది. మహిళల విభాగంలో భారత జట్టు జనవరి 14న దక్షిణ కొరియాతో తన ఖోఖో పోటీలను ప్రారంభిస్తుంది. ఈ ఖోఖో ప్రపంచ కప్ 2025 లో మొత్తం 39 జట్లు పాల్గొంటున్నాయి. పురుషుల విభాగంలో 20, మహిళల విభాగంలో 19 జట్లు ఉన్నాయి. ఖోఖో పెరుగుతున్న ప్రపంచ ఆకర్షణను ఇది ప్రదర్శిస్తుందని చెప్పాలి.
పురుషుల పోటీలో నాలుగు గ్రూపులుగా 20 జట్లు ఉన్నాయి. గ్రూప్ Aలో భారత్ లో పాటు నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌లు ఉన్నాయి. లీగ్ దశ జనవరి 16 వరకు కొనసాగుతుంది, ప్లేఆఫ్‌లు జనవరి 17న ప్రారంభమవుతాయి. ఫైనల్ జనవరి 19న జరుగుతుంది. అదేవిధంగా, మహిళల టోర్నమెంట్‌లో నాలుగు గ్రూపులుగా 19 జట్లను విభజించారు. గ్రూప్ Aలో భారత్, ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు, ఉత్తమ మూడవ స్థానంలో ఉన్న రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి.
దక్షిణాఫ్రికా, జర్మనీ, ఆస్ట్రేలియా, USA వంటి దేశాలు కూడా ఖోఖో ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. ఇది ఖో ఖో ప్రపంచ కప్ క్రీడ అంతర్జాతీయ ఉనికిని హైలైట్ చేస్తుంది. భారత జట్లు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. యావత్ ప్రపంచ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖో ఖో ప్రపంచ కప్ 2025 ఈ క్రీడకు ఒక నిర్ణయాత్మక క్షణం. స్థానిక మైదానాల నుండి ప్రపంచ వేదిక వరకు ఖోఖో అద్భుతమైన ప్రయాణానికి వేడుకగా ఉంటుంది.
ఖోఖో వరల్డ్ కప్ 2025 లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?