Kho Kho World Cup 2025: ప్రతీక్ వైకర్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు జనవరి 13, సోమవారం నాడు ఖో ఖో ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్‌లో నేపాల్‌తో తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది.
Kho Kho World Cup 2025 Exclusive: ఖో ఖో ప్రపంచ కప్ 2025 లో భారత పురుషుల జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ప్రతీక్ వైకర్ టోర్నీని ప్రారంభించానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి ముందు ప్రతీక్ తన ఆనందాన్ని దాచుకోలేకపోయాడు. ఈ టోర్నమెంట్ జనవరి 13 నుండి 19 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. ఇది భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న తొలి ఖోఖో టోర్నమెంట్ ఇది. ఈ క్రమంలోనే ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) పురుషులు, మహిళల విభాగాలకు జట్లను అధికారికంగా ప్రకటించింది. ప్రతీక్ వైకర్ పురుషుల జట్టుకు, ప్రియాంక ఇంగిల్ మహిళల జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.
భారత పురుషుల జట్టు కెప్టెన్‌గా నియమితులైనందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన పేరు ప్రకటించినప్పుడు తనకు ఒళ్ళు గగుర్పొడిచిందని ప్రతీక్ వైకర్ చెప్పారు. తాను, తన కుటుంబం చాలా కాలంగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. గత 24 సంవత్సరాలుగా నేను నిజంగా కష్టపడుతున్నాను. నేను ఖో ఖో ఆడటం ఆపలేదు. నన్ను నేను గర్వించేలా చేసుకోవాలనుకున్నందున నా కష్టానికి ఫలితం దక్కింది. నా కుటుంబం చాలా కాలంగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తోందని ప్రతీక్ చెప్పారు.
అలాగే, "కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశానికి నాయకత్వం వహించడానికి ఇది ఒక పెద్ద వేదిక. సార్ నా పేరును కెప్టెన్‌గా ప్రకటించినప్పుడు, నాకు ఒళ్ళు గగుర్పొడిచింది ఎందుకంటే ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం” అని ప్రతీక్ వైకర్ ఏసియా నెట్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. భారతదేశానికి నాయకత్వం వహించడం ప్రస్తుతం ఖో ఖో ప్రపంచ కప్ కంటే పెద్ద వేదిక లేదని 32 ఏళ్ల వైకర్ అన్నారు.
“ఖోఖో నాకు అంతర్జాతీయ ఖ్యాతిని ఇచ్చింది.. కానీ, కెప్టెన్ కావడం దానికి మించింది. ఖో ఖో ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున ఆడే అవకాశం నాకు లభించింది. ప్రస్తుతం ఈ టోర్నమెంట్ కంటే పెద్ద వేదిక లేదు. ఒలింపిక్స్ ఉంది, కానీ ఇప్పుడు మన దేశానికి గర్వకారణం చేసేందుకు ఖో ఖో ప్రపంచ కప్ కంటే పెద్ద వేదిక లేదు. ఈ టోర్నమెంట్ నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. జట్టు ప్రకటన కోసం కుటుంబం చాలా కాలంగా ఎదురు చూసింది” అని ప్రతీక్ తెలిపారు.
ఖోఖో వరల్డ్ కప్ 2025 లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
2016 నుండి ప్రతీక్ వైకర్ భారత జట్టు తరఫున ఆడుతున్నాడు. జాతీయ జట్టు తరపున 9 మ్యాచ్‌లు ఆడాడు. 2016, 2023లో రెండుసార్లు ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా ఉన్నాడు. 2023 టోర్నమెంట్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్సీ గురించి ప్రతీక్ మాట్లాడుతూ.. "జట్టు భారతీయుల అంచనాలు, ఆశలను మోసుకెళ్తున్నందున జట్టుకు నాయకత్వం వహించడం చాలా పెద్ద బాధ్యత. గతంలో భారతదేశానికి, జాతీయ స్థాయిలో మహారాష్ట్రకు నాయకత్వం వహించినందున కెప్టెన్సీ ఒత్తిడి కొత్తది కాదని" తెలిపాడు.
“కెప్టెన్ బాధ్యత చాలా పెద్దది ఎందుకంటే మేము 150 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించబోతున్నాము. ఈ సంవత్సరం ఖో ఖో ప్రపంచ కప్ జరుగుతుందని తెలుసు. ప్రతి ఒక్కరూ మేము దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. దాని కోసం ఒక బాధ్యత ఉంది” అని భారత కెప్టెన్ ప్రతీక్ అన్నారు.
“అయితే, ఇది నాకు కొత్తది కాదు ఎందుకంటే గతంలో నేషనల్స్, లీగ్‌లలో ఒత్తిడి పరిస్థితుల్లో నేను జట్టును ముందుకు నడిపించాను. నేను చిన్నప్పటి నుండి ఖో ఖో ఆడుతున్నాను. U-14, U-18, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించిన మహారాష్ట్రకు చెందిన ఏకైక ఆటగాడిని నేను. అన్ని విభాగాల్లో మేము బంగారు పతకాలు సాధించాము” అని ప్రతీక్ తెలిపారు.
కాగా, గ్రూప్ Aలో భారత్ తో పాటు నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్ దేశాలు ఉన్నాయి. ప్రతీక్ వైకర్ నాయకత్వంలోని భారత జట్టు జనవరి 13, సోమవారం నాడు టోర్నమెంట్ ప్రారంభంలో నేపాల్‌తో తమ ఖో ఖో ప్రపంచ కప్ విజయయాత్రను ప్రారంభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
ఖోఖో వరల్డ్ కప్ 2025 లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
ఖో ఖో ప్రపంచ కప్ 2025: భారత మహిళల జట్టుకు యంగ్ కెప్టెన్.. ఎవరీ ప్రియాంక ఇంగ్లే?