Kho Kho World Cup 2025: ఖో-ఖో ప్రపంచ కప్ 2025 ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది! భారత్ తో సహా 39 దేశాల జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. రికీ కేజ్ కూడా ఈ సాంప్రదాయ క్రీడకు మద్దతు తెలిపారు.
Kho Kho World Cup 2025: భారతదేశం ప్రస్తుతం ఆధ్యాత్మికత, సంస్కృతితో పాటు క్రీడలకు కూడా వేదికగా నిలుస్తోంది. మహా కుంభ్ 2025 ప్రారంభమైన వేళ, దేశంలోనే అత్యంత పురాతనమైన సాంప్రదాయ క్రీడ ఖో-ఖో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కూడా ప్రారంభమైంది. తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025 దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీతకారుడు రికీ కేజ్ ఈ సాంప్రదాయ క్రీడకు ప్రోత్సాహం అందించాలనీ, ప్రపంచ స్థాయిలో సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఖో-ఖో ప్రపంచ కప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన రికీ కేజ్, ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ.. ఇది నిస్సందేహంగా భారతదేశపు సాంప్రదాయ క్రీడ, కానీ కొత్త, ఆధునిక, ఉత్కంఠభరితమైన అవతారంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి జట్లు ఈసారి పోటీ పడుతున్నాయి. కాబట్టి ఖో-ఖో ప్రపంచ కప్ చూసి ఆనందించండి.. ఆటగాళ్లను ప్రోత్సహించండి అని పేర్కొన్నారు.
Kho-kho 2025 आज से दिल्ली में शुरू हो रहा है। ग्रैमी पुरस्कार विजेता रिकी केज ने सभी से यह खेल देखने को आग्रह किया। pic.twitter.com/Ltxxao1Xdd
— Asianetnews Hindi (@AsianetNewsHN)
భారతదేశంలో ఖో-ఖో ప్రపంచ కప్ జనవరి 13 నుండి 19 వరకు జరుగుతోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌లో భారత్‌తో సహా 39 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఏకకాలంలో జరుగుతోంది.
పురుషుల టోర్నమెంట్‌లో నాలుగు గ్రూపులు ఉన్నాయి - A, B, C, D. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూపు నుండి టాప్ 2 జట్లు క్వార్టర్ ఫైనల్ నుండి ప్రారంభమయ్యే నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడుతుంది.
గ్రూప్ A: భారత్, నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్
గ్రూప్ B: దక్షిణాఫ్రికా, ఘనా, అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇరాన్
గ్రూప్ C: బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణ కొరియా, USA, పోలాండ్
గ్రూప్ D: ఇంగ్లాండ్, జర్మనీ, మలేషియా, ఆస్ట్రేలియా, కెన్యా
మహిళల టోర్నమెంట్‌లో కూడా నాలుగు గ్రూపులు ఉన్నాయి. అయితే, గ్రూప్ Dలో ఐదు జట్లు ఉన్నాయి. నాలుగు గ్రూపుల నుండి టాప్ 2 జట్లు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్‌తో సహా టోర్నమెంట్ యొక్క నాకౌట్ దశలో ఆడతాయి. తొలి మ్యాచ్ జనవరి 13న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. భారత్ తన తొలి ఖో-ఖో ప్రపంచ కప్ టైటిల్ కోసం తన ప్రయాణాన్ని దక్షిణ కొరియాతో మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది.
గ్రూప్ A: భారత్, ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియా
గ్రూప్ B: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్
గ్రూప్ C: నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్
గ్రూప్ D: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పోలాండ్, పెరూ, ఇండోనేషియా
టోర్నమెంట్ గ్రూప్ దశ జనవరి 16న ముగుస్తుంది, నాకౌట్ దశ జనవరి 17న ప్రారంభమవుతుంది. పురుషులు, మహిళల జట్ల ఫైనల్ మ్యాచ్ జనవరి 19, ఆదివారం జరుగుతుంది.
ఖో-ఖో ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:30 గంటల వరకు కొనసాగుతాయి. ఖో-ఖో ప్రపంచ కప్ 2025 ప్రత్యక్ష ప్రసారం అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యేకంగా ప్రసారం చేయబడుతుంది. అలాగే, OTTలో ఈవెంట్‌ను చూడాలనుకునే వారు డిస్నీ+ హాట్‌స్టార్‌లో యాప్, వెబ్ సైట్ లో చూడవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఖో ఖో ప్రపంచ కప్ 2025: దేశాన్ని గర్వపడేలా చేస్తాం.. టీమిండియా కోచ్ అశ్విని శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ
ఖో ఖో ప్రపంచ కప్ 2025: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత కెప్టెన్