ఐపీఎల్ సిరీస్ 22న మొదలు కానుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ బలాలు గురించి చూద్దాం..
IPL 2025: SRH Batting and Bowling Analysis: ఐపీఎల్ క్రికెట్ సిరీస్ మొదలవ్వడానికి ఇంకొన్ని రోజులే ఉండగా, ఎక్కువ అంచనాలు పెట్టుకున్న టీమ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఒకసారి కప్పు గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గత సీజన్‌లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది.
ఈసారి ఛాన్స్ వదులు కోకూడదని ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని టీమ్ కృత నిశ్చయంతో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎక్కువగా ఫారిన్ ఆటగాళ్ల మీద ఆధారపడినా, అందులో యంగ్ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. గత సీజన్ లో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో బౌలింగ్ లోటును కవర్ చేశారు. కానీ ఈసారి బౌలర్ల బలం కూడా సరిసమానంగా ఉంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి లాంటి బలమైన ప్లేయర్స్ ఉన్నారు. అందులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తమ బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. గత సీజన్‌లో ఇద్దరూ 200 స్ట్రైక్ రేట్ తో ఆడారు. హెడ్ 567 రన్స్, అభిషేక్ 484 రన్స్ చేశారు. ఇద్దరి 70 శాతం రన్స్ పవర్ ప్లేలో వచ్చినవే.
హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి
దీంతోపాటు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అనుభవం హైదరాబాద్ టీమ్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్‌లో కలిస్తే బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుంది. ఓపెనింగ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దిగుతారు. తర్వాత ప్లేస్‌లో ఇషాన్ కిషన్ వస్తాడు. దీని తర్వాత అభినవ్ మనోహర్ లేదా సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి దిగనున్నారు.
ఆడమ్ జంపా, మహ్మద్ షమీ
బౌలింగ్ విషయానికొస్తే ప్యాట్ కమిన్స్ పరిస్థితికి తగ్గట్టు బౌలింగ్ చేయడంలో దిట్ట. ఇది కాకుండా ఎక్స్‌పీరియన్స్ ఉన్న మహ్మద్ షమీ, యంగ్ ప్లేయర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బలం చేకూరుస్తారు. ఇది కాకుండా హైదరాబాద్ టీమ్‌కు జయదేవ్ ఉనద్కట్ కూడా ఒక అవకాశంలా ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ విషయానికొస్తే నంబర్ వన్ స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ కీ ప్లేయర్లుగా ఉంటారు.
షాబాజ్ అహ్మద్
వీళ్లతో పాటు గత సీజన్‌లో షాబాజ్ అహ్మద్ ముఖ్యమైన స్పిన్ బౌలర్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ బాగా స్పిన్ బౌలింగ్ వేస్తాడు. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్ అని రెండింట్లోనూ బలంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈసారి కప్పు కొట్టడానికి రెడీగా ఉంది.