ప్రపంచంలో నంబర్ 1 క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ యాడ్స్ ద్వారా, ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. అతని ఆస్తి విలువ, సంపాదన ఎంత ఉందో తెలుుసుకుందాం.
Virat Kohli's net worth and income: ఇండియన్ క్రికెట్ టీమ్ వెన్నెముక విరాట్ కోహ్లీ. ఇటీవల ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్ సిరీస్‌లో అభిమానుల అపారమైన ప్రేమను పొందిన ఆర్సీబీ టీమ్ కోసం ఆడటానికి రెడీగా ఉన్నాడు. ఆటలో మేటి అయిన విరాట్ కోహ్లీ సంపాదన ఏంటో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ ఆస్తి విలువ
ప్రపంచంలోని టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీ క్రికెట్, యాడ్స్ ద్వారా చాలా ఆస్తులు సంపాదించాడు. 2024 ప్రకారం విరాట్ కోహ్లీ నికర ఆస్తి విలువ దాదాపు రూ.1,100 కోట్లు ($127 మిలియన్లు) అని సమాచారం.
విరాట్ కోహ్లీ ఆదాయ మార్గాలు
బీసీసీఐ కాంట్రాక్ట్ & ఐపీఎల్ శాలరీ: ఒక సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా కోహ్లీ బీసీసీఐ నుండి సంవత్సరానికి రూ.7 కోట్లు సంపాదిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో అతని ఐపీఎల్ కాంట్రాక్ట్ ప్రకారం ఒక సీజన్‌కు రూ.15 కోట్లు వస్తాయి.
మ్యాచ్ ఫీజు
విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు శాలరీగా తీసుకుంటాడు. ఇంకా పూమా, ఎంఆర్ఎఫ్, ఆడి వంటి బ్రాండ్లకు యాడ్స్ చేస్తూ రూ.196 కోట్లు సంపాదిస్తున్నాడు. అతను ఒక యాడ్‌కు రూ.7.5-10 కోట్లు తీసుకుంటాడు.
బెంజ్, ఆడి కార్లు
ఇది మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ ఎఫ్‌సీ గోవా (ఇండియన్ సూపర్ లీగ్), రాగ్న్, సిజల్ వంటి బ్రాండ్లకు కో-ఓనర్‌గా ఉన్నాడు. చాలా ఖరీదైన కార్లు విరాట్ కోహ్లీ దగ్గర ఉన్నాయి. రూ.2.72 కోట్ల విలువైన ఆడి R8 V10 ప్లస్ కారు, రూ. 2.97 కోట్ల ఆడి R8 LMX, రూ.1.51 కోట్ల ఆడి A8 L, రూ. 4.04 కోట్ల బెంట్లీ కాంటినెంటల్ GT ఇలా చాలా ఖరీదైన కార్లు విరాట్ కోహ్లీ దగ్గర ఉన్నాయి.
రూ.80 కోట్ల 2 ఇళ్లు
విరాట్ కోహ్లీకి సొంతంగా ముంబైలో రూ.34 కోట్ల విలువైన ఇల్లు, గుర్గావ్‌లో రూ.80 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉన్నాయి. కోహ్లీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అతనికి 270 మిలియన్ల కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఉన్నారు.