Kho Kho World Cup25: దేశవ్యాప్తంగా అభిమానుల ఎదురుచూస్తున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఖోఖో వరల్డ్ కప్ 2025 ఘనంగా ప్రారంభం అయింది. రౌండ్-రాబిన్ తర్వాత ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌లతో ప్రారంభమయ్యే నాకౌట్ రౌండ్‌లకు అర్హత సాధిస్తాయి. తొలి ఛాంపియన్‌షిప్‌ను భారత్ గెలుచుకోవాలని చూస్తోంది.
Kho Kho World Cup India 2025: ఖో ఖో ప్రపంచ కప్ 2025 తొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ ఎడిషన్ జనవరి 13 నుండి 19 వరకు జరగనున్నాయి. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఖోఖో ప్రపంచ కప్ 2025 తొలి టోర్నమెంట్ తో భారతదేశం ఒక చారిత్రాత్మక క్షణాన్ని చూస్తోంది.
The stage is set! 🏆✨
The Trophy & Mascot for the Kho Kho World Cup India 2025 have been unveiled at the grand inaugural ceremony! Get ready for an exciting week of thrilling matches and unforgettable moments!
Let the games begin! 🔥 … pic.twitter.com/DCppupLrHc
ఈ వారం దేశవ్యాప్తంగా అభిమానులకు థ్రిల్లింగ్ యాక్షన్ ను పంచనుంది ఖోఖో ప్రపంచ కప్ 2025. పురుషుల గేమ్‌లో 20 జట్లు, మహిళల పోటీలో 19 జట్లు పాల్గొంటున్నాయి. పురుషుల ఎడిషన్‌లో జట్లను ఐదు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. రౌండ్-రాబిన్ తర్వాత ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌లతో ప్రారంభమయ్యే నాకౌట్ రౌండ్‌లకు అర్హత సాధిస్తాయి. న్యూఢిల్లీలో జరిగే ఖో ఖో ప్రపంచ కప్ 2025 తొలి మ్యాచ్ లో భారత జట్టు నేపాల్ తో తలపడుతోంది.
The time has come! 🚨
India is all set to host the inaugural Kho Kho World Cup, starting January 13! 🏆
Get ready for the excitement! pic.twitter.com/G2w3t1ciGq
గ్రూప్ Aలో నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌లతో కలిసి భారత పురుషుల జట్టు ఇందులోనే ఉంది. జనవరి 13న నేపాల్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆడనుంది. సీనియర్ స్టార్ ప్లేయర్ ప్రతీక్ వైకర్ భారత పురుషుల ఖోఖో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత్ ప్రారంభ టైటిల్‌ను కైవసం చేసుకోగలదని అభిమానులు ఆశిస్తున్నారు.
అనుభవజ్ఞుడైన అశ్వినీ కుమార్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. డిసెంబరులో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఇంటెన్సివ్ శిక్షణా శిబిరం తర్వాత ఇరు జట్లను ఎంపిక చేశారు. నేపాల్ భారీ ప్రత్యర్థి, ఆతిథ్య జట్టుకు తొలి మ్యాచ్ అంత సులభం కాదు.
Inaugural ceremony of at Indira Gandhi Indoor Stadium, New Delhi.
This historic tournament has brought together teams from over 20 nations, celebrating the global resurgence of India’s traditional sport. pic.twitter.com/q9cQAXMsmc
ఖో ఖో మహిళా జట్లు
గ్రూప్ ఏ : ఇండియా, ఇరాన్, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా
గ్రూప్ బీ : ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్
గ్రూప్ సీ : నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్
గ్రూప్ డీ : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పోలాండ్, పెరూ, ఇండోనేషియా
Media_SAI: RT : Addressing the opening ceremony of the 1st Kho Kho World Cup at IGI Stadium, New Delhi https://t.co/47qrLi2azL
— KreedOn (@kreedonworld)