రాణించిన బౌలర్లు... టెస్ట్ సీరిస్‌లో భారత్ బోణి

By Arun Kumar PFirst Published Aug 22, 2018, 3:51 PM IST
Highlights

ఎట్టకేలకు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భారత జట్టు బోణి కొట్టింది. మూడో టెస్టులో ఘన విజయం సాధించి సీరిస్ ఆశలను సజీవంగా ఉంచింది. మొత్తానికి ఇవాళ కొనసాగిన ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్ తోకను భారత్ బౌలర్ అశ్విన్ తొందరగానే ఔట్ చేశాడు. దీంతో 203 పరుగుల తేడాతో భారత్ విజయం ఖరారయ్యింది.  
 

ఎట్టకేలకు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భారత జట్టు బోణి కొట్టింది. మూడో టెస్టులో ఘన విజయం సాధించి సీరిస్ ఆశలను సజీవంగా ఉంచింది. మొత్తానికి ఇవాళ కొనసాగిన ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్ తోకను భారత్ బౌలర్ అశ్విన్ తొందరగానే ఔట్ చేశాడు. దీంతో 203 పరుగుల తేడాతో భారత్ విజయం ఖరారయ్యింది.  

నిన్న నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఓవర్ నైట్ స్కోరు వద్ద ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో ఆరు పరుగులు మాత్రమే జోడించగలిగింది. చివరి వికెట్ గా అండర్సన్(11) అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇవాళ కేవలం 2.5 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది. 

మొత్తంగా ఈ సీరిస్ లో మొదటి రెండు టెస్ట్ లలో టీంఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నిర్మయాత్మక మూడో టెస్ట్ లో మాత్రం సమిష్టిగా రాణించిన టీం ఇండియా ఆతిథ్య జట్టుపై మొదటిసారి పైచేయి సాధించింది. ఇలా ఐదు మ్యాచ్ లటెస్ట్ సీరిస్ లో ఇంగ్లాండ్ ఆదిక్యాన్ని  2-1 కి తగ్గించింది. దీంతో టీం ఇండియా సీరిస్ ఆశలు సజీవంగా ఉంచి ప్రేక్షకుల్లో మిగతా మ్యాచ్ లపై ఆసక్తిని పెంచింది.    

మొత్తానికి అటు బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా ఈ టెస్ట్ తో గాడిలో పడింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అద్బుతమైన బ్యాటింగ్ తో చెలరేగి సెంచరీ చేయడంతో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా చెలరేగాడు. 5 వికెట్లు తీసి ఇంగ్లాడ్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. ఇతడికి  ఇషాంత్ 2, షమి 1, అశ్విన్ 1, పాండ్యా 1, తోడవడంతో భారత విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.  

ఇంగ్లాడ్ బ్యాట్ మెన్స్ బట్లర్(106) సెంచరీ, స్టోక్స్(62) హాప్ సెంచరీలు చేసి భారత విజయాన్ని మరో రోజు ఆలస్యం చేశారే కానీ ఆపలేక పోయారు. మొత్తంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఘనవిజయం సాధించి  ప్రేక్షకులకు టెస్ట్ మ్యాచ్ మజా ఏంటో రుచి చూపించారు.
 

నాలుగో రోజు ఆట గురించి చదవండి

నిప్పులు చెరిగిన బుమ్రా: భారత్ విజయం ఐదో రోజుకు వాయిదా
 

click me!