వరల్డ్ కప్ పేవరేట్ భారత జట్టే ...మా టీంపై అసలు అంచనాలే లేవు: డుప్లెసిస్

By Arun Kumar PFirst Published Jan 31, 2019, 3:02 PM IST
Highlights

మరికోద్దిరోజుల్లో జరగనున్న ప్రపంచ దేశాల క్రికెట్ సమరం గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్2019 లో భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుందని పేర్కొన్నాడు. ఇలా ఓ వైపు భారత్‌ను పొగుడుతూ, సొంతజట్టును తులనాడుతూ డుప్లెసిస్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. 

అంతర్జాతీయంగా అత్యుత్తమ జట్లను నిర్ణయించే వరల్డ్ కప్ ట్రోపిని అందుకోవాలని ప్రతి దేశం భావిస్తుందని డుప్లెసిస్ తెలిపారు. కానీ తమకు ఆ అవకాశం ఇప్పటివరకు లభించకపోవడం చాలా  దురదృష్టకరమన్నారు. తాము భారీ అంచనాలతో బరిలోకి దిగిన ప్రతిసారీ తమకు నిరాశే మిగిలిందనా...అందువల్ల అసలు అంచనాలే లేకుండానే ప్రపంచ కప్ కోసం సిద్దమవుతున్నట్లు డుప్లెసిస్ పేర్కొన్నాడు. 

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే  వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్లు భారీ అంచనాలతో దిగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆ జట్ల ఆటతీరు కూడా గత కొంతకాలంగా అత్యుత్తమంగా వుందన్నాడు.  ఈ రెండు జట్లను వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్స్ గా పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని డుప్లెసిస్ తెలిపాడు. 

ఇప్పుడు తమ జట్టు యువ క్రికెటర్లతో నిండివుందని...చాలా మంది ఆటగాళ్లు మొదటిసారి ప్రపంచ కప్ ఆడదామని ఎదురుచూస్తున్నట్లు డుప్లెసిస్ పేర్కొన్నాడు. వారితో పాటు సీనియర్లు కూడా ఆ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపై దృష్టి సారించారని తెలిపాడు. కానీ తమది బలమైన జట్టు ఎంతమాత్రం కాదని...అందువల్లే అంచనాలు పెట్టుకోలేదని డుప్లెసిస్ వెల్లడించాడు. 

click me!