మాది మంచితనమే...చేతకాని తనం కాదు: సర్జికల్ స్ట్రైక్స్‌పై క్రీడాకారుల స్పందన

First Published Feb 26, 2019, 5:27 PM IST

పుల్వామా ఉగ్రవాద దాడికి ఇవాళ భారత సైన్యం   ప్రతీకారం తీర్చుకుంది. అకారణంగా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికే 40మందికి పైగా భారత సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. దీంతో యావత్ భారతదేశం ఉగ్రచర్యపై అట్టుడికిపోయింది.కేవలం సామాన్యులే కాదు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ఉగ్రవాదులతో పాటు వారికి ఆశ్రయం కల్పిస్తున్నపాక్ కు వారి బాషలోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం, ఆర్మీ కూడా వారి దాడులకు ప్రతిదాడులతోనే సమాధానం చెప్పారు. 

undefined
ఇవాళ తెల్లవారుజామున పీవోకేతో పాటు పాక్ భుబాగంలోకి చొరబడ్డ భారత వాయుసేన విమానాలు ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా బాంబులతో దాడికి తెగబడ్డాయి. అత్యంత ప్రణాళికబద్దంగా కేవలం కొన్ని నిమిషాల్లోనే వాయుసేన యుద్ద విమానాలు జైషే మహ్మద్ తో పాటు వేరే ఉగ్రవాద క్యాంపులపై కూడా దాడిచేశారు. దీంతో 300మందిని ముష్కరులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
undefined
భారత ప్రభుత్వ ఆదేశాలతో ఆర్మీ చేపట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ పట్ల భారత క్రీడాకారులు స్పందించారు. సచిన్, గంభీర్ వంటి క్రికెటర్లతో పాటు యావత్ భారత్ క్రీడాలోకం భారత ఆర్మీకి, ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ ట్వీట్ల ద్వారా మాతృదేశానికి మద్దతు తెలిపారు. ఏయే క్రీడాకారులు ఎలా స్పందించారో చూద్దాం.
undefined
సచిన్ టెండూల్కర్: ''మన మంచితనాన్ని బలహీనతగా ఎప్పుడూ అర్థం చేసుకోవద్దు. ఇండియన్ ఎయిర్ పోర్స్ కు నా సెల్యూట్, జైహింద్'' అంటూ సచిన్ ట్వీట్ చేశారు.
undefined
సైనా నేహ్వాల్: ''మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తో ఉగ్రవాదులకు గట్టిగా సమాధానమిచ్చిన ఇండియన్ ఎయిర్ పోర్స్ కు మా సెల్యూట్... జైహింద్'' అంటూ సైనా స్పందించారు.
undefined
మహేష్ భూపతి: జైహింద్ అంటూ ట్వీట్ చేశారు.
undefined
హర్భజన్ సింగ్: మన సైనికదళాల పోటోను పోస్ట్ చేసి... ఇండియన్ వాయుసేనను చూస్తే ఎప్పుడూ ఎంతో గర్వంగా వుంటుందంటూ హర్భజన్ ట్వీట్ చేశారు.
undefined
గౌతమ్ గంభీర్: జైహింద్...ఇండియన్ ఎయిర్ పోర్స్ అంటూ ట్వీట్ చేశారు.
undefined
శిఖర్ ధావన్: ''ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైనికుల దైర్యానికి, సమయస్పూర్తితో కూడిన చర్యలకు నా సెల్యూట్'' అంటూ స్పందించారు.
undefined
సురేష్ రైనా: '' దేశం కష్టకాలంలో వున్న సమయంలో ఐఏఎఫ్ సైనికుల గొప్ప ధైర్యంతో పోరాడారు. వారికి నా సల్యూట్. ఉగ్రమూకలకు ఇది సరైన సమాధానం. జైహింద్'' అంటూ ట్వీట్ చేశారు.
undefined
అంజింక్యా రహానే: ''ఇండియన్ ఆర్మీ దైర్యసాహసాలతో టెర్రరిస్ట్ లకు సరైన జవాభిచ్చారు. మీ చర్యతో మేము ఎంతో గర్వపడుతున్నాం. జైహింద్ '' అంటూ ట్వీట్ చేశారు.
undefined
click me!