అంతర్జాతీయ క్రికెట్ జట్లలో అన్నదమ్ముల జోడీలివే...

Published : Feb 06, 2019, 03:51 PM ISTUpdated : Feb 06, 2019, 03:57 PM IST

అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లకు వుండే క్రేజ్ అంతాఇంతా కాదు. భారత్ వంటి దేశాల్లో కొందరు క్రికెటర్లను అభిమానులను దేవుళ్లతో పోలుస్తుంటారు. అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ అలా  ఆడే అరుదైన అవకాశం ఏ కొందరికో లభిస్తుంది. అలాంటిది ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ముళ్లు జట్టులో స్ధానం సంపాదించడమంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇది అసాధ్యం కాదని నిరూపిస్తూ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగిన అన్నదమ్ముళ్లు వున్నారు. అలాంటి క్రికెట్ బ్రదర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

PREV
19
అంతర్జాతీయ క్రికెట్ జట్లలో అన్నదమ్ముల జోడీలివే...
మొదట మన భారత జట్టు విషయానికి వస్తే తాజాగా పాండ్యా బ్రదర్స్(హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా) వెల్లింగ్టన్ టీ20 లో భారత జట్టు తరపున బరిలోకి దిగారు.దీంతో మరోసారి క్రికెటర్లుగా ఎదిగిన అన్నదమ్ముల గురించి చర్చ మొదలయ్యింది.

29
గతంలో మొహిందర్ అమర్‌నాథ్, సురీందర్ అమర్‌నాథ్ లు కలిసి మూడు వన్డేల్లో టీమిండియా తరఫున ఆడారు.

39
ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కలిసి 8 వన్డేలు, 8 టీ20ల్లో కలిసి ఆడగా తాజాగా పాండ్యా బ్రదర్స్ రూపంలో మరో అన్నదమ్ముల జోడి భారత జట్టులో ప్రవేశించింది.

49
ఇక మిగతా జట్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీంలో అన్నదమ్ముల జోడీలు ఎక్కువగా కనిపిస్తాయి. మార్ష్ బ్రదర్స్ ( మిచెల్ మార్ష్, షాన్ మార్ష్), చాపెల్ బ్రదర్స్( గ్రేగ్ చాపెల్, ఇయాన్ చాపెల్) , వా బ్రదర్స్(స్టీవ్ వా, మార్క్ వా), హస్సీ బ్రదర్స్ (మైఖెల్ హస్సీ, డేవిడ్ హస్సీ), వాగ్ బ్రదర్స్ (మార్క్ ఎడ్వర్డ్ వాగ్, డీన్ వాగ్) ఇలా చాలా మంది అన్నదమ్ముల జోడిలు ఆస్ట్రేలియా జట్టులో స్ధానం సంపాదించారు.

59
న్యూజిలాండ్ జట్టు తరపున డాషింగ్ బ్యాట్ మెన్‌గా పేరుతెచ్చుకున్న బ్రెండన్ మెక్ కల్లమ్‌తో పాటు అతడి సోదరుడు నాథన్ మెక్ కల్లమ్ అంతర్జాతీయ మ్యాచుల్లో కలిసి ఆడారు. ఇదే జట్టు తరపున జెఫ్ క్రవ్, మార్టిర్ క్రవ్ బ్రదర్స్ గతంలో కొన్ని మ్యాచులు ఆడారు.

69
సౌత్ ఆఫ్రికా జట్టలో మోర్నీ మోర్కెల్, ఆల్బీ మోర్కెల్ కలిసి అంతర్జాతీయ మ్యాచులు ఆడారు.

79
మన దాయాది దేశం పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కూడా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఆడారు. కమ్రన్ అక్మల్, ఉమర్ అక్మల్ అంతర్జాతీయ మ్యాచుల్లో పాకిస్థాన్ జట్టు తరపున ఆడారు.

89
జింబాబ్వే క్రికెట్ జట్టులో ఫ్లవర్ బ్రదర్స్( ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్), ఐర్లాండ్ జట్టులో ఓబ్రెయిన్ బ్రదర్స్ కూడా అంతర్జాతీయ క్రికెటర్లు ఎదిగారు. ఇక దేశవాళి క్రికెటర్లుగా అయితే చాలామంది అన్నదమ్ములు ఎదిగినా వారిలో అతికొంత మంది అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.

99
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ జట్టులో కూడా ఓ అన్నదమ్ముల జోడి వుంది. కుర్రమ్ బ్రదర్స్ (టామ్ కుర్రమ్, బెన్ కుర్రమ్) ఇంగ్లాండ్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు.

click me!

Recommended Stories