మొదటి టీ20 ఓటమి ఎఫెక్ట్: ముగ్గురు భారత ఆటగాళ్లపై వేటు తప్పదా?

First Published Feb 7, 2019, 6:14 PM IST

న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే సీరిస్ లో అదరగొట్టిన టీంఇండియా టీ20 సీరిస్ విషయానికి వచ్చేసరికి తడబడుతోంది. మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా ఇప్పటికే వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ విభాగంలోనూ ఘోరంగా విఫలమై ఆతిథ్య జట్టు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఏకంగా 80 పరుగల తేడాతో ఓడిపోయి భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండో టీ20 లో మరోసారి అలాంటి పొరపాటు జరకుండా వుండేందుకు టీంఇండియా మేనేజ్ మెంట్ సిద్దమయ్యింది, అందుకోసం జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే సీరిస్ లో అదరగొట్టిన టీంఇండియా టీ20 సీరిస్ విషయానికి వచ్చేసరికి తడబడుతోంది. మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా ఇప్పటికే వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ విభాగంలోనూ ఘోరంగా విఫలమై ఆతిథ్య జట్టు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఏకంగా 80 పరుగల తేడాతో ఓడిపోయి భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండో టీ20 లో మరోసారి అలాంటి పొరపాటు జరకుండా వుండేందుకు టీంఇండియా మేనేజ్ మెంట్ సిద్దమయ్యింది, అందుకోసం జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  మొదటి టీ20 లో భారత బౌలర్ల డొల్లతనం బయటపడింది.  కివీస్ బ్యాట్ మెన్స్ ని జోరును భారత బౌలర్లు అడ్డుకోలేకపోవడంతొ భారీ స్కోరు సమోదయ్యింది. దీంతో రెండో టీ20లో ఒకరిద్దరు బౌలర్లపై వేటు పడనుందని తెలుస్తోంది.
undefined
వెల్లింగ్టన్ టీ20 మ్యాచ్ లో విఫలమైన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రెండో వన్డేకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృనాల్ మొదటి టీ20 లో 4 ఓవర్లేసి 1 వికెట్ మాత్రమే పడగొట్టి 37 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ లో మిగతా వాళ్లతో కాస్త పరవాలేదనిపించినా అతడిపై వేటు పడే అవకాశం వుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
ఇక యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అతడు మొదటి టీ20లో 4 ఓవర్లేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకుని కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో ఖలీల్ కు శుక్రవారం జరగనున్న రెండో టీ20 తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
కేవలం బౌలింగ్ విభాగంలోనే కాకుండా వెల్లింగ్టన్ టీ20 లో భారత్ బ్యాటింగ్ లో కూడా విఫలమైంది. దీంతో భారత బ్యాటింగ్ విభాగంలొ కూడా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ విజయ్ శంకర్ ను రెండో టీ20 నుండి తప్పించే అవకాశం కనిపిస్తోంది. అలా కాని నేపథ్యంలో రిషబ్ పంత్, ధినేశ్ కార్తిక్ లలో ఎవరో ఒకరు జట్టుకు దూరం కానున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరి స్థానాల్లో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, సిద్దార్థ్‌ కౌల్ లకు రెండో టీ20 లో ఆడే అవకాశం లభించవచ్చు. ఇలా రెండో టీ20 గెలుపు కోసం భారత జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
undefined
click me!