డబ్ల్యూటీటీ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకున్న భారత జోడీ..

Published : Jun 26, 2023, 08:29 AM IST
డబ్ల్యూటీటీ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకున్న భారత జోడీ..

సారాంశం

సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీలు డబ్ల్యూటీటీ వరల్డ్ టైటిల్ గెలుచుకుని సంచలనం సృష్టించారు. 

ట్యునీషియా : వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో  భారత జోడి సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ సంచలనం సృష్టించింది.  ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఈ టోర్నీలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ జోడి మహిళల డబుల్స్ లో ఛాంపియన్గా నిలిచింది. సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీలు మహిళల డబుల్స్ లో  మియు కీహారా-మివా హరిమోటో(జపాన్) జంట మీద విజయం  సాధించారు.  

వీరితో 35 నిమిషాల పాటు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ  జోడి 11-5, 11-6,5 -11,13-11తో గెలిచింది. సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ జంటకు వెయ్యి డాలర్లు అంటే రూ. 82000 ప్రైజ్ మనీతో పాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు విజేతగా నిలిచినందుకు లభించాయి. డబ్ల్యూటీటిటి కంటెండర్ టోర్నీ టైటిల్ను భారత క్రీడాకారులు దక్కించుకోవడం ఇది మూడోసారి. 

మొదటిసారి 2019లో మనిక బత్రా-అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటిటి టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్-హర్మీత్ దేశాయ్ ట్యూనిషియాలో జరిగిన డబ్ల్యుటిటి టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. మూడోసారి తాజాగా ఇప్పుడు సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీలు గెలుచుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Team India: వీళ్లే ఇంత డేంజర్ అయితే.. టీమిండియాలోకి ఆ పిచ్చోడు వస్తే ఇక నెత్తిన గుడ్డే
Sanju Samson House : సంజూ శాంసన్ రాజభవనం లాంటి ఇల్లు చూశారా? దీని విలువెంతో తెలుసా?