Sanjay Dutt: మూడు రోజుల వ్యవధిలో రెండు టీమ్స్‌ను కొనుగోలు చేసిన మున్నాభాయ్.. అధీర ఫోకస్ అంతా క్రికెట్ పైనే..

Published : Jun 25, 2023, 06:03 PM IST
Sanjay Dutt: మూడు రోజుల వ్యవధిలో రెండు టీమ్స్‌ను కొనుగోలు చేసిన మున్నాభాయ్.. అధీర ఫోకస్ అంతా క్రికెట్ పైనే..

సారాంశం

LPL 2023: బాలీవుడ్  నటుడు సంజయ్ దత్ మూడు  క్రికెట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. మూడు రోజుల వ్యవధిలోనే మున్నాభాయ్.. రెండు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాడు. 

బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్  వయసు పెరుగుతున్నా ఆలోచనలు మాత్రం నిత్య నూతనంగా ఉంటున్నాయి.  సినిమాలలో ఆయన  వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే  మరోవైపు  క్రికెట్ మీద కూడా ఫోకస్ పెట్టాడు మున్నాభాయ్.  ఇటీవలే మూడు రోజుల క్రితం జింబాబ్వే వేదికగా  జులై నుంచి జరుగబోయే  జిమ్ అఫ్రో టీ10 లీగ్ లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ఈ కేజీఎఫ్  విలన్.. తాజాగా  లంక  ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో  కూడా   ఓ ఫ్రాంచైజీకి  కో-ఓనర్ అయ్యాడు.  

జులై 30 నుంచి శ్రీలంకలో జరుగబోయే లంక ప్రీమియర్ లీగ్ లో  సంజయ్ దత్.. బీ-లవ్  క్యాండీ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. అంతకుముందు  క్యాండీ వారియర్స్ గా  ఉన్న ఈ జట్టు ఈ సీజన్ లో బీ-లవ్ క్యాండీగా పేరు మార్చుకుంది.  లంక స్పిన్నర్ వనిందు హసరంగ దీనికి సారథి.  

యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీ - లవ్ నెట్వర్క్ అధినేత ఓమర్ ఖాన్ దీనికి యజమాని.  ఇప్పుడు ఈ టీమ్  లో సంజయ్ దత్ కూడా   పెట్టుబడులు  పెట్టాడు. ఈ విషయాన్ని  సంజయ్ దత్ తన ట్విటర్ వేదికగా ప్రకటించాడు.  ట్విటర్ లో  సంజయ్ దత్ స్పందిస్తూ... ‘నేను, నా స్నేహితులు ఓమర్ ఖాన్, హెచ్.హెచ్. షేక్ మర్వాన్ బిన్, మహ్మద్ బిన్ రషీద్ అల్ తో కలిసి  బీ- లవ్ క్యాండీ క్రికెట్ ఫ్రాంచైజీని దక్కించుకున్నాం’అని ట్విటర్ లో పోస్టు చేశాడు.

 

సంజయ్ దత్..  మూడు రోజుల క్రితమే జింబాబ్వే వేదికగా జరుగనున్న  జిమ్ ఆఫ్రో టీ10 లీగ్  లో కూడా  పెట్టుబడులు పెట్టాడు.  ప్రముఖ  వ్యాపార సంస్థ ఏరీస్ వ్యవస్థాపకుడు  సోహన్ రాయ్ తో కలిసి  మున్నాభాయ్.. జింబాబ్వే టీ10 లీగ్ లో హరారే హరికేన్ టీమ్ ను సొంతం చేసుకున్నాడు.   ఐదు జట్లతో ఆడబోతున్న ఈ లీగ్ జులై 20 నుంచి  29 వరకు జరుగనుంది.   జిమ్ అఫ్రో లీగ్ లో    హరారే హరికేన్స్, డర్బన్ క్వాలందర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్‌ ఉన్నాయి.  వచ్చే నెల 2న అక్కడ ఆటగాళ్ల వేలం జరుగనుంది. 

ఇక లంక ప్రీమియర్ లీగ్ విషయానికొస్తే.. ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియ  ముగిసిన నేపథ్యంలో  జులై 30 నుంచి ఈ లీగ్ మొదలుకానుంది.   ఆగస్టు 20న  లీగ్ ముగుస్తుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !