Asian Para Games: శరత్ శంకరప్పకు గోల్డ్ మెడల్.. కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర

Published : Oct 24, 2023, 07:58 PM IST
Asian Para Games: శరత్ శంకరప్పకు గోల్డ్ మెడల్.. కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర

సారాంశం

ఏషియన్ పారా గేమ్స్ 2023లో భారత్ మరో గోల్డ్ మెడల్‌ను సాధించింది. 0.01 సెకండ్ల తేడాతో భారత అథ్లెట్ శరత్ శంకరప్ప మహంకాళి జోర్డాన్ అథ్లెట్ నబీల్ మఖాబ్లేపై గెలిచారు.  

న్యూఢిల్లీ: ఏషియన్ పారా గేమ్స్ 2023లో భారత్‌ జైత్రయాత్ర సాగిస్తున్నది. తాజాగా మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 5000 మీటర్లు టీ13 ఈవెంట్‌లో భారత అథ్లెట్ శరత్ శంకరప్ప మహంకాళి పైచేయి సాధించారు. 0.01 సెకండ్ల తేడాతో జోర్డాన్ అథ్లెట్ నబీల్ మఖాబ్లేపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సంపాదించారు. 2:18:90 టైమింగ్‌లో లక్ష్యాన్ని పూర్తి చేశారు.

Also Read: మాకు ఆ వివరాలు తెలియజేయండి.. ఇజ్రాయెల్ సైన్యం ఫ్లైట్‌లో నుంచి పాలస్తీనాలో కరపత్రాలు

శరత్ శంకరప్ప మహంకాళి, నబీల్ మఖాబ్లేలు ఇద్దరూ చివరి వరకు పోటాపోటీగానే పరుగు పెట్టారు. చివరి వరకు వీరి మధ్య గెలుపు ఎవరిదా? అనే ఉత్కంఠ కొనసాగింది. ఇలాంటి సందర్భంలో భారత అథ్లెట్ శరత్ శంకరప్ప మహంకాళి స్వల్ప తేడాతో బంగారు పతాకాన్ని పొందారు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు