పాకిస్తాన్ ఆట చూడలేక వెళ్లిపోయిన మిక్కీ ఆథర్! ప్రతీదానికి విసుక్కుంటాడంటూ...

By Chinthakindhi Ramu  |  First Published Oct 24, 2023, 7:43 PM IST

ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైన పాకిస్తాన్... పాక్ చెత్త ఫీల్డింగ్ చూడలేక డగౌట్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయిన టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆథర్.. 


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో నెదర్లాండ్స్‌ని చిత్తు చేసిన పాకిస్తాన్, ఆ తర్వాత శ్రీలంకపై 344 పరుగుల భారీ స్కోరు ఛేదించి... రికార్డు క్రియేట్ చేసింది. అయితే అహ్మదాబాద్‌లో అక్టోబర్ 14న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ టీమ్ డొల్లతనం బయటపడింది..

టీమిండియాతో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఈ రెండు టాప్ టీమ్స్ కదా ఓడిపోయిందని ఫ్యాన్స్ సర్దిచెప్పుకునేలోపు.. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది పాకిస్తాన్..

Latest Videos

ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ పక్కగా గెలుస్తుందని ధీమాగా కూర్చున్న పాకిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ మిక్కీ ఆథర్, పాక్ ప్లేయర్ల ఫీల్డింగ్ చూసి, తట్టుకోలేక అసహనంతో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. ఇండియాతో మ్యాచ్ తర్వాత స్టేడియంలో ‘దిల్ దిల్ హై పాకిస్తాన్’ పాట వేయలేదని కామెంట్ చేసిన మిక్కీ ఆథర్‌పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్..

‘మిక్కీ ఆథర్ కోచింగ్‌లో నేను దాదాపు మూడేళ్లు ఆడాను. అతను ప్రతీ దానికి విసుక్కుంటాడు. అన్నింటికీ కంగారుపడతాడు. నాకు అప్పుడప్పుడు అతను ఇష్టం లేకుండానే పాకిస్తాన్ టీమ్‌కి పనిచేస్తున్నాడేమో అనే అనుమానాలు కూడా కలుగుతాయి. కేవలం డబ్బు కోసమే పనిచేసేవాళ్లకు టీమ్‌తో ఇలాంటి అనుబంధమే ఉంటుంది..’ అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్.. 

click me!