ఇషాంత్ శర్మ వాయిస్ మిమిక్రీ చేసిన యువరాజ్..!

By telugu news teamFirst Published Sep 3, 2021, 11:02 AM IST
Highlights

ఇషాంత్ శర్మ వాయిస్ ని మిమిక్రీ చేసి.. ఆ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం గమనార్హం. దానికి హ్యాపీ బర్త్ డే అంటూ క్యాప్షన్ జత చేసి మరీ షేర్ చేశాడు.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గురువారం తన 33వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. కాగా.. అతనికి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.  కాగా.. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం ఇషాంత్ కి భిన్నంగా బర్త్ డే విషెస్ తెలియజేయడం గమనార్హం.

ఇషాంత్ శర్మ వాయిస్ ని మిమిక్రీ చేసి.. ఆ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం గమనార్హం. దానికి హ్యాపీ బర్త్ డే అంటూ క్యాప్షన్ జత చేసి మరీ షేర్ చేశాడు. ఇషాంత్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు యూవీ పేర్కొన్నాడు. ఈ వీడియోకి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. ఇషాంత్ శర్మకు బీసీసీఐ, ఐసీసీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఇండియన్ క్రికెటర్లు వృద్ధిమాన్ స్వాహా, దినేశ్ కార్తీక్ లు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇషాంత్ శర్మకు తుది జట్టులో  చోటుు దక్కకపోవడం గమనార్హం. 

click me!