చెలరేగిన పాండ్యా: కుప్పకూలిన ఇంగ్లాండు

By pratap reddyFirst Published Aug 20, 2018, 8:04 AM IST
Highlights

భారత్ తొలి ఇన్నింగ్సు ఆదివారంనాడు 329 పరుగుల వద్ద ముగిసింది. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ భారత బౌలర్ల ముందు తల వంచారు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన పేస్ తో బంతులు విసిరి ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించాడు.

నాటింగ్ హామ్: ఇంగ్లాండుతో జరిగిన రెండు తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన భారత్ మూడో టెస్టులో పట్టు బిగిస్తోంది. మూడో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండు బౌలర్లపై తన కసిని తీర్చుకున్నాడు. దాంతో ఇంగ్లాండు తొలి ఇన్నింగ్సులో 161 పరుగులకే కుప్పకూలింది. 

భారత్ తొలి ఇన్నింగ్సు ఆదివారంనాడు 329 పరుగుల వద్ద ముగిసింది. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ భారత బౌలర్ల ముందు తల వంచారు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన పేస్ తో బంతులు విసిరి ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించాడు.

ఇంగ్లాండు ఓపెనర్స్ మంచి ఆరంభాన్నిచ్చినా తర్వాతి బ్యాట్స్ మెన్ భారత ఫాస్ట్ బౌలింగు ముందు నిలబడలేకపోయారు. ఇషాంత్ శర్మ వేసిన 12వ ఓవరు చివరి బంతికి అలెస్టక్ కుక్ (29) కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత 13వ ఓవరు తొలి బంతికే మరో ఓపెనర్ జెన్నింగ్స్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

ఆ తర్వాత కెప్టెన్ జో రూట్ వికెట్లను కాపాడుకుంటూ ఒల్లి పోప్ తో కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ ఇషాంత్ శర్మ్ వేసిన 20వ ఓవరులో పోప్ (10) పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే హార్దిక్ పాండ్యా వేసిన 25వ ఓవరు తొలి బంతికి జో రూట్ (16) కెఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.

కేవలం ఆరు ఓవర్లు మాత్రమే విసన పాండ్యా 28 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రూట్ తో పాటు బెయిర్ స్టో (15), క్రిస్ వోక్స్ (8), రషీద్ (5), బ్రాడ్ (0) వికెట్లను పాండ్యా పడగొట్టాడు. 128 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయిన తరుణంలో బాస్ బట్లర్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేసి స్కోరు పెంచాడు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులుచేసింది. ఛతేశ్వర్ పుజారా 33 పరుగులతో, కోహ్లీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ ఇంగ్లాండు తొలి ఇన్నింగ్సు స్కోరుపై 292 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఈ వార్తలు చదవండి

కోహ్లీ మరో ఘనత: గంగూలీని దాటేశాడు

సిక్స్ తో రిషబ్ పంత్ ఎంట్రీ: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

ఇంగ్లండుతో టెస్టు: బ్లాక్ బ్యాండ్ లతో బరిలోకి కోహ్లీ సేన

click me!