
Asian Athletics Championships 2025: దక్షిణ కొరియాలోని గుమిలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మూడో రోజు ఇండియన్ అథ్లెట్లు 3 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. దీంతో ఇండియా మొత్తం మెడల్స్ 14కి చేరాయి, అందులో 5 గోల్డ్ ఉన్నాయి.
అవినాష్ సాబ్లే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజి గోల్డ్ మెడల్ గెలిచింది. జ్యోతి మధ్యలో 5వ స్థానంలో ఉన్నా చివరిలో జోష్ చూపించి గోల్డ్ గెలిచింది.
మహిళల 4x400 మీటర్ల రిలేలో సుభా వెంకటేశన్ చివరి ల్యాప్‌లో అదిరిపోయే స్పీడ్ చూపించి ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. ఈ రేస్ చాలా ఉత్కంఠగా సాగింది.
పురుషుల 4x400 మీటర్ల రిలే టీం సిల్వర్ మెడల్ గెలిచింది.
మహిళల లాంగ్ జంప్‌లో ఇండియాకు రెండు మెడల్స్ వచ్చాయి. అంసీ సోజన్ సిల్వర్, శైలి సింగ్ బ్రాంజ్ మెడల్ గెలిచారు.