PBKS vs RCB: పంజాబ్ పై ఈజీ విక్టరీ.. ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ

Published : May 29, 2025, 10:09 PM IST
RCB vs RR Photos

సారాంశం

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ కు ఆర్సీబీ మరింత దగ్గరైంది. ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. 

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025  క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ గెలుపుతో విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఫైనల్ లోకి చేరింది. ఐపీఎల్ 2025 టైటిల్ కు అడుగు దూరంలో ఉంది. 

ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్ పై ఆర్సీబీ విక్టరీ కొట్టింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ టీమ్ మొదట బ్యాటింగ్ చేసి 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది.

స్వల్ప టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలోనే 106/2 పరుగులతో విక్టరీ కొట్టింది. 8 వికెట్ల తేడాతో పంజాబ్ పై విజయం సాధించింది. ఫిలిప్ సాల్ట్ 56 పరుగులతో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.

 

 

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. జోష్ హేజిల్ వుడ్, సుయశ్ శర్మలు తలో 3 వికెట్లు తీసి పంజాబ్ బ్యాటింగ్‌ను దెబ్బ‌కొట్టారు. యశ్ దయాల్ కు 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, రోమారియో షెఫర్డ్ ల‌కు చెరో ఒక వికెట్ ద‌క్కింది.

పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా విఫలమయ్యారు. మార్కస్ స్టోయినిస్ 26, అజ్మతుల్లా 18, ప్రభ్ సిమ్రన్ సింగ్ 18 పరుగులు చేశారు. నేహల్ వ‌ధేరా, ప్రియాంష్‌ ఆర్య, జోష్ ఇంగ్లిష్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శ‌శాంక్ సింగ్ లు చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు.

ఆర్సీబీ 10 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ను అందుకుని విజ‌యం సాధించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 27 బంతుల్లో 57 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ 19, రజత్ పటీదార్ 15 నాటౌట్, విరాట్ కోహ్లీ 12 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమిసన్, ముషీర్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.

ఈ విజయంతో ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. గతంలో 2009 (డెక్కన్ ఛార్జర్స్), 2011 (చెన్నై సూపర్ కింగ్స్), 2016 (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఫైనల్‌లలో ఆర్సీబీ ఓడిపోయింది. ఈసారి ట్రోఫీపై కన్నేసింది. ఇక పంజాబ్ కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. పంజాబ్ జూన్ 1న క్వాలిఫయర్ 2లో ముంబయి ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్‌తో తలపడతారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !