అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ బౌలర్

By Arun Kumar PFirst Published Oct 20, 2018, 3:59 PM IST
Highlights

టీంఇండియా బౌలర్ ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయంగా జరిగే అన్ని పార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న ప్రవీణ్ ప్రకటించాడు. బాగా ఆలోచించిన తర్వాత రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని నిర్ణయానికి వచ్చే ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించాడు. తనకు క్రికెట్ ఎంతో ఇచ్చిందని...దీన్ని వదలడం బాధగా వున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రవీణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. 

ఉత్తర ప్రదేశ్ కు చెందిన పేస్ బౌలర్ ప్రవీణ్ 2007 లో నాగ్ పూర్ వేధికగా జరిగిన వన్డే ద్వారా ఆరంగేట్రం చేశాడు. కానీ టెస్ట్ జట్టులో చోటు సంపాదించుకోడానికి చాలా ఏళ్లు పట్టింది. వన్డే ఆరంగేట్రం చేసి నాలుగేళ్లు గడిచిన తర్వాతగానీ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ప్రవీణ్ టెస్టుల్లో స్థానం సంపాదించుకున్నాడు. కానీ టెస్టుల్లో అంతలా రాణించలేకపోయాడు. దీంతో కేవలం 6 మ్యాచులే ఆడి 27 వికెట్లు పడగొట్టాడు.

అయితే వన్డేల్లో మాత్రం తనదైన శైలి బౌలింగ్ యాక్షన్ తో ప్రవీణ్ చెలరేగిపోయేవాడు. ఇలా తన కెరీర్ లో 68 వన్డేల్లో టీంఇండియా తరపున ఆడిన ప్రవీణ్ 77 వికెట్లు పడగొట్టాడు. అలాగే 10 టీ20 మ్యాచులాడి 8వికెట్లు తీశాడు.

2012లో చివరిసారిగా సౌతాప్రికాతో జరిగిర  మ్యాచే ప్రవీన్ కు చివరిది. ఆ తర్వాత భారత  జట్టులో స్థానం కోల్పోయిన అతడు మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. చివరకు ఇలా రిటైర్మెంట్ ప్రకటించి మొత్తానికి అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించాడు. 

ఓ క్రికెటర్ గా తన జర్నీ అద్భుతంగా సాగినట్లు ప్రవీణ తెలిపాడు. ఈ జీవితాకిది చాలు....బరువెక్కిన హృదయంతో క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రవీణ్ ట్వీట్ చేశాడు. తనను ప్రోత్సహించిన కుటుంబంతో పాటు బీసీసీఐకి ప్రవీణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

its been a great jounery.
Its been a great life.
With a heavy heart I want to say gud bye to my 1st love
But the test cap no 268 nd ODI 170 will be mine till indian cricket era will continue... Thankyou nd for helping me to live up my dream.🇮🇳

— praveen kumar (@praveenkumar)

click me!