రయ్ రయ్ రయ్.. ఫార్ములా ఈ రేసుకు భాగ్యనగరం తయ్యారోయ్...!

By Srinivas M  |  First Published Feb 11, 2023, 10:45 AM IST

Formula E Race:  భారత్ మొట్టమొదటిసారి ఆతిథ్యమిస్తున్న  ఫార్ములా ఈ రేసుకు  సమయం ఆసన్నమైంది.   నేటి  మధ్యాహ్నం  హుస్సేన్‌సాగర్ చుట్టూ  రేసింగ్ కార్లు దూసుకుపోనున్నాయి..  
 


వారాంతంలో నగర ప్రజల  ఆనందాన్ని రాకెట్ వేగంతో డబుల్ చేయడానికి  ఫార్ములా ఈ రేసు  సిద్ధమైంది.   భారత్ లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న  ఎఫ్ఐఎ ఫార్మాలా ఈ ఛాంపియన్‌షిప్  నేడు హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్  చుట్టూ  నిర్మించిన ప్రత్యేక ట్రాక్ (స్ట్రీట్ సర్క్యూట్)  చుట్టూ జరుగనుంది.  ట్రాక్ పై అవగాహన కల్పించేందుకు గాను  శుక్రవారం  ప్రీ ప్రాక్టీస్ - 1 ను నిర్వహించగా   శనివారం ఉదయం   8 గంటల నుంచి 9 గంటల వరకూ  ప్రీ ప్రాక్టీస్ - 2 ను నిర్వహించారు.   మరికొద్దిసేపట్లో క్వాలిఫయింగ్ రౌండ్ కు తెర లేవనుంది.  ఈ రేస్ ను వీక్షించడానికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలతో  పాటు  క్రికెటర్లు, రాజకీయ రంగ ప్రముఖులు కూడా   ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.  

ట్యాంక్‌బండ్ చుట్టూ  నిర్మించిన  2.83 కిలోమీటర్ల ట్రాక్ పై  రేసర్లు దూసుకుపోనున్నారు. రేసర్ల విన్యాసాలను వీక్షించడానికి గాను  ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. టికెట్ ధరలను  వెయ్యి, నాలుగు వేలు,  ఏడు వేలు,  పది వేల ఐదు వందలుగా నిర్ణయించారు.  

Latest Videos

undefined

7 వేలు, 10 వేల టికెట్లు  ఇంకా అందుబాటులో ఉన్నా  మిగతా కేటగిరీ టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. సుమారు 20 వేల మంది వీక్షకులు ఈ రేసింగ్ ఈవెంట్ ను చూసే అవకాశమున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.  

ముగిసిన ప్రీ ప్రాక్టీస్.. 

కాగా.. నిన్న ముగిసిన ప్రీ ప్రాక్టీస్  - 1  ను చూడటానికి కూడా  అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు.   ఆ సంఖ్య నేడు భారీగా పెరగొచ్చు. నిన్నటి పోటీలో  ‘ఎన్విసన్ రేసింగ్’ టీమ్ కు చెందిన  డ్రైవర్  సెబాప్టియన్  బ్యూమి  (జాగ్వార్  1 టైప్ 6 కారు) అగ్రస్థానంలో నిలిచాడు.   రెండో స్థానంలో  ‘డీఎస్ పెన్స్‌కే’కు చెందిన స్టోఫెల్ వాన్‌డూర్న్  నిలిచాడు.  ‘నియో 333 రేసింగ్’ టీమ్    సెర్గియో కెమర  నిలవగా.. ‘మహీంద్ర రేసింగ్’  డ్రైవర్  లుకాస్ డి గ్రాసి  ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.  శనివారం ఉదయం జరిగిన ప్రీ ప్రాక్టీస్ - 2లో  పాస్కకల్ వెహ్ల్రీన్ అగ్రస్థానంలో నిలిచాడు. బ్యూమి రెండో స్థానంలో నిలవగా  లుకాస్ డి గ్రాసి నాలుగో స్థానం సాధించాడు. 

 

Your Qualifying groups ahead of our inaugural race in India! 🔥

Who will be on Pole for the ? 🧐

— ABB FIA Formula E World Championship (@FIAFormulaE)

పాల్గొనబోయే జట్లు.. 

- ఈ రేస్ కు  11 జట్లకు చెందిన  22 మంది డ్రైవర్లు పోటీలో ఉన్నారు.  భారత్ నుంచి  ‘మహీంద్ర టీమ్’   పోటీలో ఉంది.  ఈసారి మహీంద్ర టీమ్ నుంచి ఒలివర్ రోలండ్, ల్యూకాస్ గ్రాసి డ్రైవర్లుగా  వ్యవహరిస్తున్నారు.

ఏంటీ ఫార్ములా ఈ రేసు..? 

సాధారణ రేసింగ్ కార్ల మాదిరిగా కాక ఎలక్ట్రిక్  కార్లతో  ఈ రేసింగ్ జరుగబోతున్నది.   కర్భన ఉద్గారాలను తగ్గించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.  పర్యావరణ  హితం కోరుతూ   ఆయా దేశాలు ‘గో గ్రీన్’ పేరిట ఎఫ్1 రేసుల స్థానంలో ‘ఫార్ములా ఈ రేసు’లను ప్రోత్సహిస్తున్నాయి.  పెట్రోల్, డీజిల్ కార్ల వాడకాన్ని తగ్గించడం కూడా   దీని ప్రధాన ఉద్దేశం. 

ఈ పోటీల గురించి.. 

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగనున్న పోటీలు 9వ సీజన్ కు సంబంధించినవి.   ప్రతి సీజన్ లో  16 రేసులు ఉంటాయి. హైదరాబాద్ లో జరుగబోయేది నాలుగో రేస్.  తొలి మూడు రేస్ లు  మెక్సికో, దిరియా  (సౌదీ లో రెండు రేస్ లు)  జరిగాయి. హైదరాబాద్ లో జరిగేది నాలుగోది.  మిగిలినవి  కేప్‌టౌన్,  సావోపాలో, మొనాకో, బెర్లిన్, జకర్తా,  పోర్ట్ లాండ్, రోమ్, లండన్ లో జరుగుతాయి.  

click me!