మహిళల టీ20 ప్రపంచకప్ లో సంచలనం.. శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ.. సౌతాఫ్రికాకు షాక్

Published : Feb 11, 2023, 10:11 AM IST
మహిళల టీ20 ప్రపంచకప్ లో సంచలనం.. శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ.. సౌతాఫ్రికాకు షాక్

సారాంశం

ICC Womens World Cup 2023:  శుక్రవారం కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా - శ్రీలంక మధ్య జరిగిన  తొలి లీగ్ మ్యాచ్ లో సఫారీ జట్టు.. 3 పరుగుల తేడాతో ఓడింది. లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న  సౌతాఫ్రికన్ టీమ్ కు షాక్ తప్పలేదు.

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో ఘనమైన ఆరంభం. ఆతిథ్య జట్టు (సౌతాఫ్రికా) కు శ్రీలంక షాక్ ఇచ్చింది. శుక్రవారం కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా - శ్రీలంక మధ్య జరిగిన  తొలి లీగ్ మ్యాచ్ లో సఫారీ జట్టు.. 3 పరుగుల తేడాతో ఓడింది. లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న  సౌతాఫ్రికన్ టీమ్ కు షాక్ తప్పలేదు. తొలుత  బ్యాటింగ్ చేసిన లంక మహిళల జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడానికి లంక బౌలర్లు అత్యద్భుతంగా రాణించారు.  సఫారీలను  126 పరుగులకే పరిమితం చేసి 3 పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. 

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరిగిన  మ్యాచ్ లో  సౌతాఫ్రికా టాస్ గెలిచి  శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది.  లంక ఓపెనర్  మాధవి   (8)  తక్కువస్కోరుకే వెనుదిరగింది. కానీ మరో ఓపెనర్, కెప్టెన్  ఆటపట్టు (50 బంతుల్లో 68, 12 ఫోర్లు)  విష్మి గుణరత్నె (34 బంతులలో 35, 4 ఫోర్లు)  రాణించారు.  

లంక ఇన్నింగ్స్ మరీ  నెమ్మదిగా సాగింది. అయితే   ఈ ఇద్దరూ ఔటయ్యాక  వచ్చిన  అనుష్క సంజీవని (5), నీలాక్షి డి సిల్వ (4), అమ కంచన (4) లూ త్వరగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.   దీంతో లంక.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. 

 

స్వల్ప లక్ష్య ఛేదనలో  సౌతాఫ్రికా తడబడింది.    ఓపెనర్లు లారా వల్వార్డ్ట్  (18), టజ్మిన్ బ్రిట్స్ (12) లతో పాటు తర్వాత వచ్చిన  మరిజన్నె  (11), కెప్టెన్ సున్ లుస్  (28) లు క్రీజులో నిలవలేదు.  చోల్ ట్రైయాన్  (10), బోష్ (0) లతో పాటు వికకెట్ కీపర్ సినాలో జఫ్టా  (15) కూడా విఫలమయ్యారు. లంక బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి  సఫారీ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.  చివరి ఓవర్లో 12 పరుగులు చేస్తే విజయమనగా.. సుగుణకుమారి  వేసిన ఆ ఓవర్లో   తొమ్మిది పరుగులే వచ్చాయి. ఇద్దరు బ్యాటర్లు కూడా ఔటయ్యారు. దీంతో   లంక మూడు  పరుగుల తేడాతో ఈ టోర్నీలో బోణీ కొట్టింది.  

 

ఈ టోర్నీలో నేడు వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ నడుమ  మ్యాచ్ లు  జరుగుతాయి.  రేపు (ఆదివారం) భారత్ - పాక్ ల మధ్య మ్యాచ్ జరుగనుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు