క్యాచ్‌లు నేలపాలు.. నెత్తి బాదుకుంటూ పాండ్యా ఫ్రస్ట్రేషన్

By sivanagaprasad KodatiFirst Published Feb 10, 2019, 3:40 PM IST
Highlights

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకమైనది. ఈ మ్యాచ్‌లో ఏ చిన్న తప్పిదం చేసినా విజయవకాశాలు దెబ్బతింటాయి. కివీస్ ఇన్నింగ్స్‌లో మన్రో 76 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. 

అయితే అతనికి భారత ఫీల్డర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి రక్షించారు. హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో టీమిండియా ఆటగాళ్లు సులువైన క్యాచ్‌లను వదిలేశారు. మున్రో భారీ షాట్ ఆడగా.. ఖలీల్ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

మూడో బంతికి మున్రో మళ్లీ షాట్ ఆడగా శంకర్ మిస్ ఫీల్డ్‌తో అది బౌండరీ లైన్ తాకింది.  ఆ తర్వాతి బంతిని మున్రో సిక్సర్‌ బాదాడు. ఆ వెంటనే అతను ఇచ్చిన మరో క్యాచ్‌ను థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్‌లో ఉన్న కుల్దీప్ అందుకోలేకపోయాడు. ఓ వైపు మున్రో చితక్కొట్టుకు తోడు..భారత ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్‌ చేయడంతో బౌలింగ్‌లో ఉన్న హార్డిక్ పాండ్యా తీవ్ర అసహానానికి గురయ్యాడు. నెత్తి బాదుకుంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. 

హామిల్టన్ టీ20: పోరాడి ఓడిన భారత్, సిరీస్ న్యూజిలాండ్ వశం

టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..

క్యాచ్‌లు నేలపాలు.. నెత్తి బాదుకుంటూ పాండ్యా ఫ్రస్ట్రేషన్

అదృష్టం న్యూజిలాండ్ వైపే.. ఆ బాల్ వైడ్ అయ్యుంటే

click me!