కివీస్‌కు చుక్కలు చూపిన సృతీ..సెంచరీ మిస్

Siva Kodati |  
Published : Feb 10, 2019, 11:52 AM IST
కివీస్‌కు చుక్కలు చూపిన సృతీ..సెంచరీ మిస్

సారాంశం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న చివరి టీ20లో భారత స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు స్మృతీ ధాటిగా ఆడింది.

ఓ వైపు వికెట్లు పడుతున్నా వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరికి తరలిస్తూ.. 62 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఇందులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. సెంచరీకి చేరువవుతున్న సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి రెండు వికెట్లు తీసింది.

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?