ఇంగ్లాండు ఆటగాడి బ్యాట్ పై అసభ్య పదజాలం

First Published Jun 4, 2018, 5:01 PM IST
Highlights

ఇంగ్లాండ్‌ బ్యాట్స్ మన్ జోస్‌ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది.

హెడింగ్లే: ఇంగ్లాండ్‌ బ్యాట్స్ మన్ జోస్‌ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. క్రికెట్ అభిమానులు కూడా బట్లర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తన బ్యాట్‌పై ఉన్న అసభ్యకరమైన పదజాలానికి అతను ఐసిసి ఆగ్రహానికి గురయ్యాడు. 

తొలి టెస్టులో పాకిస్తాన్ పై పరాజయం పాలైన ఇంగ్లాండ్‌ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది.  ఇంగ్లాండ్‌ విజయంలో బట్లర్‌ కీలకపాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

రెండో టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట మధ్యలో డ్రింక్స్‌ విరామ సమయంలో బట్లర్‌ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. ఆ సమయంలో బట్లర్‌ బ్యాట్‌ హ్యాండిల్‌పై రాసిన అసభ్య పదజాలం ‘f**k it’ని కెమెరా పట్టుకుంది. 

దాన్ని గమనించిన అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ‘బట్లర్‌ తన బ్యాట్‌పై ఏమి రాసుకున్నాడో చూశారా’ అంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తూ వెళ్లారు. 

ఆ పదజాలంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  మరోసారి ఇలా చేయకూడదని బట్లర్ ను మందలించి వదిలేసింది.

click me!