మరోసారి మెరిసిన రషీద్ ఖాన్ : డెహ్రాడూన్ టీ20లో బంగ్లాపై అప్ఘాన్ ఘన విజయం

First Published 4, Jun 2018, 1:23 PM IST
Highlights

మూడు వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్

బంగ్లాదేశ్ తో టీ20 సీరీస్ లో భాగంగా డెహ్రాడూన్ లో జరిగిన ఫస్ట్ టీ20 లో అప్ఘానిస్థాన్ జట్టు ఘప విజయం సాధించింది.  ఇటీవల  ఐపిఎల్ 11 లో ఎస్ఆర్ఎచ్ తరపున తన బౌలింగ్ తో అదరగొట్టిన అప్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇతడు విజృంబించడంతో 167 పరుగల లక్ష్యాన్ని చేదించడంలో బంగ్లా చతికిల పడింది. 
 
భారత్‌తో చారిత్రక టెస్ట్‌కు సిద్ధమవుతున్న ఆఫ్ఘానిస్థాన్‌... దానికి ముందు బంగ్లాదేశ్‌తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడుతోంది. ఇందులో భాగంగా డైహ్రాడూన్ లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ 45 పరుగులతో గెలుపొందింది. 
 
ముందుగా అఫ్గానిస్తాన్‌ 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అప్ఘానిస్థాన్ ఆటగాడు షహజాద్‌(40 పరుగులు) అద్భుతంగా బ్యాటింగ్ చేసి అప్ఘాన్ కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం అప్ఘాన్ బౌలర్ల దాటికి బంగ్లా విలవిల్లాడిపోయింది.  19 ఓవర్లలో 122 పరుగులకే బంగ్లా జట్టు ఆలౌటైంది. అప్ఘాన్ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 13 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు.


 

Last Updated 4, Jun 2018, 1:23 PM IST