స్పిన్, పేస్‌తో టీమిండియా ఎటాక్.. ఇంగ్లాండ్ 93/7

Published : Aug 03, 2018, 06:27 PM IST
స్పిన్, పేస్‌తో టీమిండియా ఎటాక్.. ఇంగ్లాండ్ 93/7

సారాంశం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. స్పిన్, పేస్‌తో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. స్పిన్, పేస్‌తో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. రెండో రోజు రెండో  ఇన్నింగ్స్‌లో ముందుగా అశ్విన్ ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశాడు..

తొలుత ఓపెనర్ అలిస్టర్‌ కుక్‌ను డకౌట్ చేసిన అశ్విన్.. ఆ తర్వాత జెన్నింగ్స్, కెప్టెన్ జో రూట్‌లను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు.. అనంతరం రంగంలోకి దిగిన ఇషాంత్.. పదునైన బౌలింగ్‌తో రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ బెంబేలేత్తించాడు.. డెవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్‌ల వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. సామ్ కర్రెన్, అదిల్ రషీద్‌లు క్రీజులో ఉన్నారు. మొత్తం మీద రూట్ సేన 106 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే