
లండన్: పరువు కోసం పోరాడాల్సిన చివరి టెస్టులోనైనా భారత్ తన బ్యాటింగ్ కు పదును పెట్టలేకపోయింది. ఇంగ్లాండుపై జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచులో తొలి ఇన్నింగ్సులో 174 పరుగులకే ఆరు వికెట్లను జారవిడుచుకుంది. శిఖర్ ధావన్ (3) బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
అయితే ఓపెనర్ రాహుల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మరో వైపు పుజారా ఇంగ్లాండు బౌలర్లను దీటుగా ఎదుర్కునే ప్రయత్నం చేశాడు. భారత్ మరో వికెట్ పడకుండా టీ బ్రేక్‌కు వెళ్లింది. చివరి సెషన్‌లో భారత లైనప్ కుదులైంది. ఇంగ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.
తొలుత రాహుల్ (37)ను ఓ అద్భుత స్వింగర్‌కు కర్రాన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కోహ్లీ, పుజారా కూడా పెద్దగా నిలదొక్కుకలేకపోయారు. వీరిద్దరు 31 పరుగులు జోడించిన తర్వాత ఆండర్సన్ బౌలింగ్‌లో పుజారా (37) అవుటయ్యాడు. తన మరుసటి ఓవర్‌లోనే రహానెను ఆండర్సన్ డకౌట్ చేయడంతో భారత్ 103 రన్స్‌కు 4 వికెట్లు కోల్పోయింది.
అంతర్జాతీయ టెస్టు మ్యాచుల్లోకి అడుగు పెట్టిన బ్యాట్స్‌మన్ విహారి ఫరవాలేదనిరపించాడు. 29 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసిన విహారి ఆ తర్వాత 45వ ఓవర్‌లో సిక్స్, ఫోర్‌లతో దారిలోకి వచ్చాడు. కర్రాన్ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లతో సత్తా చాటుకున్నాడు.
మరో వైపు కోహ్లీ కూడా చెలరేగగా 18 బంతుల్లోనే 35 పరుగులు వచ్చాయి. కానీ 47వ ఓవర్‌లో కోహ్లీని స్టోక్స్ అవుట్ చేశాడు. నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. శనివారం ఆట ముగిసే సమయానికి విహారి 25 పరుగులతో, రవీంద్ర జడేజా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనాలు చదవండి
ఆదుకున్న బట్లర్, బ్రాడ్: ఇంగ్లాండు స్కోరు 332
చెలరేగిన ఇషాంత్ శర్మ: ఇంగ్లాండు స్కోరు 198/7