టీ20 నుంచి ధోనీకి ఉద్వాసన: విండీస్ తో సిరీస్ నుంచి కోహ్లీకి రెస్ట్

Published : Oct 27, 2018, 07:13 AM IST
టీ20 నుంచి ధోనీకి ఉద్వాసన: విండీస్ తో సిరీస్ నుంచి కోహ్లీకి రెస్ట్

సారాంశం

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు 16 మంది సభ్యులతో కూడిన జట్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ రెండు సిరీస్ లకు కూడా ధోనీని పక్కన పెట్టారు. 

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిసిసిఐ సెలెక్షన్ కమిటీ షాక్ ఇచ్చింది.  ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు 16 మంది సభ్యులతో కూడిన జట్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ రెండు సిరీస్ లకు కూడా ధోనీని పక్కన పెట్టారు. 

వెస్టిండీస్ తో నవంబర్ 4వ తేదీ నుంచి జరిగే టీ20 సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు మాత్రం కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. హార్దిక్ పాండ్యాను కూడా సెలక్టర్లు దూరం పెట్టారు.

ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచులు టెస్టు సిరీస్ కు కూడా విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. 
 
విండీస్‌తో జరిగే టీ20 సిరీస్ కు జట్టు ఇదే

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, డీకే, మనీశ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కృణాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ నదీమ్
 
ఆసీస్‌తో జరిగే సిరీస్‌కు టీమ్:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్(వైస్ కెప్టెన్), శిఖర్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ , మనీశ్, డీకే, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృణాల్ పాండ్య, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాద్, ఖలీల్.

ఆసీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, పృత్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమాన్ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, ఇషాంత్, ఉమేష్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?