సన్ రైజర్స్ ఓటమిపై వార్నర్ ఏమన్నాడంటే...

Published : May 28, 2018, 12:23 PM ISTUpdated : May 28, 2018, 12:44 PM IST
సన్ రైజర్స్ ఓటమిపై వార్నర్ ఏమన్నాడంటే...

సారాంశం

చెన్నైకే కాదు సన్ రైజర్స్ జట్టుకు కూడా అభినందలు తెలిపిన వార్నర్

ఐపీఎల్ ఫైనల్ ఓటమిపాలై ట్రోపిని అందుకోలేకపోయామని బాధపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ సారథి వార్నర్ అండగా నిలిచారు.తమ జట్టు ఓడిపోవడంపై వార్నర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జట్టు ఒక్క ఫైనల్ లో ఓడినంత మాత్రాన నిరాశ చెందవద్దని మొత్తం టోర్నమెంట్ లో చూపిన అద్భుత ప్రదర్శనకు గర్వపడాలని వార్నర్ సూచించారు.  

ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వాట్సన్ ను వార్నర్ ప్రశంసించాడు. షేన్ వాట్సన్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని అన్నారు. నిజంగా అతడి బ్యాటింగ్ స్టైల్ అద్భుతమని.. అతడి వీరోచిత ఇన్నింగ్స్ చూడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.  

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..
Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?