వాట్సన్ సూపర్: ఐపిఎల్ విజేత చెన్నై

First Published 27, May 2018, 9:03 PM IST
Highlights

ఐపిఎల్ 11 సీజన్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ముంబై:  

చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ విజేతగా నిలించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన ముందు ఉంచిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూనాయసంగా ఛేదించింది. హైదరాబాద్ బౌలర్లకు షేన్ వాట్సన్ చుక్కులు చూపించారు. 57 బంతుల్లో 8 సిక్స్ లు, 11 ఫోర్లతో అతను 117 పరుగులు చేశాడు. 

సిద్ధార్త్ కౌల్ వేసిన రెండు ఓవర్లలో 32 పరుగులు చేసిన చెన్నై జట్టు క్రమంగా రన్‌రేటును తగ్గించుకుంటూపోయారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ 13వ ఓవర్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ వాట్సన్ చెలరేగిపోయాడు. 

ఈ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. వరుస బంతుల్లో ఒక ఫోరు, మూడు సిక్సులు బాది సన్‌రైజర్స్‌ని కష్టాల్లోపడేశారు. ఈ ఒక్క ఓవర్‌తో చెన్నై విజయం సునాయసం అయింది.

ఐపిఎల్ 11 సీజన్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చివరలో యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 పరుగులు) రెచ్చి పోవడంతో హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

సన్‌రైజర్స్ పవర్ ప్లేలో స్వల్పస్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి గోస్వామి(5) రనౌట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. 

ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు పిండుకోవడం హైదరాబాద్ కు కష్టంగా మారింది. ప్రధానంగా లుంగి ఎంగిడి తాను వేసిన నాలుగో ఓవర్‌ని మేడిన్ చేశాడు. ఆ తర్వాతి రెండు ఓవర్లలో విలియమ్సన్, ధావన్‌లు బౌండరీలు కొట్టడంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. 

శిఖర్ ధావన్ 25 పరుగులు చేసి అవుట్ కాగా, విలియమ్సన్ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. షకీబ్ ఆల్ హసన్ 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హుడా 3 పరుగులు, బ్రాత్ వైట్ 21 పరుగులు చేశారు.

చెన్నై బౌలర్లలో నిగిడి, ఠాకూర్, శర్మ, బ్రేవో, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. 

విలియమ్సన్ రికార్డు

చెన్నై సూపర్ కింగ్స్‌  ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో 700లకు పైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేసి ఔట్ అయిన కేన్ ఈ సీజన్‌లో 735 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాచ్‌ని సొంతం చేసుకున్నాడు. 

గతంలో ఈ రికార్డును క్రిస్ గేల్, మైక్ హస్సీ, డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీ సాధించారు. నేటి మ్యాచ్‌తో విలిలియమ్సన్ ఈ జాబితాలో చేరాడు. 

Last Updated 27, May 2018, 11:07 PM IST