బుధవారం ఆఫ్ఘనిస్తాన్ తో ఇండియా మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు టీం ఇండియా ఆటగాళ్లు. తాజాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఆఫ్గనిస్తాన్తో టీమ్ ఇండియా తలపడిన ఈ మ్యాచ్లో 56 బంతుల్లో విరాట్ కోహ్లీ 55 పరుగులు చేశాడు. వీటిలో ఆరు ఫోర్ లు ఉన్నాయి.
56 బాల్స్ కి 55 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. దీంతో ప్రపంచకప్ వన్డే, టీ20 టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో క్రికెట్ దిగజం సచిన్ టెండూల్కర్ పేరుమీద ఉండేది. సచిన్ 44 వరల్డ్ కప్ ఇన్నింగ్స్ లో.. మొత్తం 2278 పరుగులు చేశాడు. కాగా, తాజాగా విరాట్ కోహ్లీ.. నిన్నటి తాజా ఇన్నింగ్స్ తో కలుపుకుని.. 53 ఇన్నింగ్స్ లో.. 60 కి పైగా సగటు రన్ రేట్ తో 2311 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ తో క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.
ICC World cup 2023: ఆఫ్ఘాన్‌పై టీమిండియా ఘన విజయం... వరుసగా రెండో విజయంతో...
ఆ సమయంలో బంగ్లాదేశ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్.. కోహ్లీకి డెబ్యూ మ్యాచ్. ఈ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి నాట్ అవుట్ గా నిలిచి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ వరల్డ్ కప్ లో జరిగిన తొమ్మిది ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 282 పరుగులు చేసి అదరగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ లో ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు కోహ్లీ. అప్పటినుంచి ఇప్పటివరకు పరుగుల వరద కొనసాగిస్తూనే ఉన్నాడు. వరల్డ్ కప్ లో భారత్ తరఫున ప్రస్తుతం కోహ్లీ 1170 పరుగులతో.. మూడో అత్యధిక రన్ స్కోరర్ గా నిలిచాడు.
అంతకుముందు భారత్ తరపున.. సచిన్ టెండూల్కర్, గంగూలీ ఉన్నారు. ఇక టి20 వరల్డ్ కప్ లో విషయానికి వస్తే కెరీర్లో.. మొత్తం ఐదు షార్ట్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొన్న కోహ్లీ…లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో మొత్తంగా 25 ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్ కోహ్లీ 81.5 0 సగటున 14 హాఫ్ సెంచరీల సాయంతో 1141 పరుగులు చేశాడు. కాగా, ఆఫ్గనిస్తాన్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ సెంచరీతో శతక్కొట్టగా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో.. భారత్ విజయం నల్లేరు మీద నడకలా మారింది. కేవలం 35 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని కైవసం చేసుకుంది.