భువీకి షాక్: నీ భార్య కాదు, నా భార్య అన్న జరోవర్

Published : Jul 02, 2018, 09:23 PM IST
భువీకి షాక్: నీ భార్య కాదు, నా భార్య అన్న జరోవర్

సారాంశం

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ కుమారుడు జరోవర్‌ భారత జట్టు ఆటగాళ్లతో కలుపుగోలుగా తిరుగుతుంటాడు.

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ కుమారుడు జరోవర్‌ భారత జట్టు ఆటగాళ్లతో కలుపుగోలుగా తిరుగుతుంటాడు. ఐపీఎల్ టోర్మమెంట్ సమయంలో భారత బౌలర్ భువనేశ్వర్‌, జరోవర్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 

ఇద్దరూ కలిసి అప్పుడప్పుడూ బయటకు వెళ్తుంటారు. ఇద్దరి మధ్య ఇటీవల జరిగిన ఓ హాస్య సన్నివేశాన్నిభువీ గుర్తు చేసుకున్నాడు. ఓసారి భువనేశ్వర్ భార్య నూపుర్ తో జరోవర్ ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో భువీ అక్కడికి వచ్చాడు. 

జరోవర్‌ను ఆటపట్టించాలనే ఉద్దేశంతో అతన వద్దకు వెళ్లి  నూపుర్ ను చూపిస్తూ, ఆమె నా భార్య అని గట్టిగా అన్నాడు. దీనికి జరోవర్ ఏ మాత్రం తడుముకోకుండా జవాబిచ్చాడు. 

ఆమె నా భార్య, ఆదివారం మాత్రమే నీకు భార్య అని అనడంతో భువీ  నోరు వెళ్లబెట్టాడు. ఆ తర్వాత అందరూ కలిసి హాయిగా నవ్వుకున్నారు. ఈ విషయాన్ని చెప్పి భువీ పగలబడి నవ్వాడు.

PREV
click me!

Recommended Stories

గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..
IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !