క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్... బీసీసీఐ వాదన ఇదే

Published : Sep 03, 2019, 10:34 AM IST
క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్... బీసీసీఐ వాదన ఇదే

సారాంశం

ఛార్జ్ షీట్ చూసేంత వరకు షమీపై ఎలాంటి చర్యలు తీసుకోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఛార్జ్ షీట్ ని తెప్పించుకొని పరిశీలించాకే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. షమీపై అతడి భార్య చేసిన ఆరోపణల కారణంగా గతంలో బీసీసీఐ అతడికి వార్షిక కాంట్రాక్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అరెస్టు వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. గృహ హింస చట్టం కింద షమీకి అరెస్టు వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం... 15 రోజుల్లోగా షమీ సరెండర్ కావాలని ఆదేశించింది. సరెండర్ అయిన తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. కాగా.. షమీకి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా బీసీసీఐ స్పందించింది.

ఛార్జ్ షీట్ చూసేంత వరకు షమీపై ఎలాంటి చర్యలు తీసుకోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఛార్జ్ షీట్ ని తెప్పించుకొని పరిశీలించాకే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. షమీపై అతడి భార్య చేసిన ఆరోపణల కారణంగా గతంలో బీసీసీఐ అతడికి వార్షిక కాంట్రాక్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

కాగా.. గతేడాది.. షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ పలు ఆరోపణలు చేశారు. షమీకి చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. తనను హింసిస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసు నేపథ్యంలోనే షమీకి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. షమీతోపాటు ఆయన సోదరుడిపై కూడా సెక్షన్ 498ఏ కింద కేసు నమోదయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Devdutt Padikkal : 4 మ్యాచుల్లో 3 సెంచరీలు.. గంభీర్, అగార్కర్‌లకు పెద్ద తలనొప్పి!
Sarfaraz Khan : 16 సిక్సర్లు, 14 ఫోర్లు, 217 రన్స్.. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో రోహిత్ రికార్డు బద్దలు !